AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు లిప్ స్టిక్స్, నెయిల్ పాలిష్‌లు అమ్మాడు.. ఇప్పుడు స్టార్ హీరోగా కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఈ హీరో బస్సుల్లో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ అమ్ముతూ జీవనం సాగించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో పొట్ట కూటి కోసం ఈ పని చేశాడు. కానీ అతను ఇప్పుడు అగ్ర నటుడిగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడ బెట్టాడు.

Tollywood: అప్పుడు లిప్ స్టిక్స్, నెయిల్ పాలిష్‌లు అమ్మాడు.. ఇప్పుడు స్టార్ హీరోగా కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Apr 03, 2025 | 7:45 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు స్వయం కృషితో ఎదిగిన వారే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్స్ గా మారిన వారే. ఈ స్టార్ నటుడు కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. తల్లిదండ్రులు కన్నుమూయడంతో 18 ఏళ్లకే రోడ్డుపైకొచ్చాడు. మొదట తండ్రి క్యాన్సర్ తో కన్నుమూశాడు. ఆ తర్వాత రెండేళ్లకు తల్లి కూడా మూత్రపిండాల జబ్బుతో ప్రాణాలు విడిచింది. వీటికి తోడు చట్టపరమైన ఇబ్బందుల కారణంగా సొంతింటిని కోల్పోయి రోడ్డున పడ్డాడు. తనకు చేతనైన పని చేస్తూ, దొరికింది తింటూ కడుపు నింపుకొన్నాడు. జీవనోపాధి కోసం బస్సులో లిప్ స్టిక్ నెయిల్ పాలిష్ అమ్మాడు. అలాగే ఒక ఫోటో ల్యాబ్‌లో కూడా పనిచేశాడు. అదే క్రమంలో సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ సినిమాలో అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. ఆతర్వాత తన జీవితమే మారిపోయింది. స్టార్ నటుడిగా బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను మరెవరో కాదు ఆ మధ్యన ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ.

అర్షద్ వార్షీ సినిమాల్లోకి రాక ముందు కడుపు నింపుకోవడానికి చాలా పనులు చేశాడు. అందులో భాగంగానే బోరివలి- బాంద్రా మధ్య బస్సులలో లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ కూడా అమ్మేవాడట. కాగా అర్షద్ వార్సీకి నృత్యం అంటే చాలా ఇష్టం. దీంతో అతను అక్బర్ సమీ నృత్య బృందంలో చేరాడు. మొదట కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఆ తర్వాత ‘తేరే మేరే సప్నే’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు మరియు ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Arshad Warsi (@arshad_warsi)

అర్షద్ వార్సీ పలు విభిన్నమైన పాత్రలను పోషించడం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారాడు. గోల్‌మాల్‌లో మానవ్‌గా, ధమాల్‌లో ఆదిత్య శ్రీవాస్తవగా అతను పండించిన హాస్యం అందరికీ గుర్తుండి పోతోంది. ఇక ‘మున్నాభాయ్’ సినిమాతో అర్షద్ వార్సీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమాలో అతను పోషించిన ‘సర్క్యూట్’ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడు అర్షద్ వార్సీ.

టీవీ షోలో అర్షద్ వార్సీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా