- Telugu News Photo Gallery Cinema photos Nara Rohith Celebrates Ugadi With His Fiance Siri Lella, See Photos
Nara Rohith: చూడముచ్చటైన జంట.. కాబోయే భార్యతో కలిసి నారా రోహిత్ ఉగాది వేడుకలు.. ఫొటోస్ ఇదిగో
ప్రతినిధి 2 సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ సిరి లేళ్లతో కలిసి జీవితం పంచుకోనున్నాడు హీరో నారా రోహిత్. గతేడాది ఇరు పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్న జంట ఇటీవల ఉగాదిని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
Updated on: Apr 01, 2025 | 10:22 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ క్రమంలో హీరో నారా రోహిత్ తనకు కాబోయే భార్యతో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారీ కాబోయే దంపతులు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'చూడముచ్చటైన జంట' అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాబోయే దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

నారా రోహిత్- సిరి లేళ్ల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్ 14న గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

త్వరలోనే నారా రోహిత్- సిరి లేళ్ల వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికివస్తే.. ప్రస్తుతం భైరవం సినిమాలో హీరోగా చేస్తున్నాడు నారా రోహిత్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు.





























