- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Sonali Bendre says she had bad experience while shooting in a Kannada Movie
Sonali Bendre: ఆ దక్షిణాది సినిమాలో చేదు అనుభవం.. సంచలన విషయాన్ని బయటపెట్టిన సోనాలి బింద్రే
సోనాలి బింద్రే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఒక దక్షిణాది సినిమాలో నటిస్తున్నప్పుడుమాత్రం సోనాలికి చేదు అనుభవం ఎదురైందట.
Updated on: Apr 01, 2025 | 10:48 PM

. బాలీవుడ్ నటీమణులు ఇప్పుడు దక్షిణాది చిత్రాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం బాలీవుడ్ కంటే దక్షిణ భారత చిత్ర పరిశ్రమ గొప్పదని, ఇక్కడ ప్రతిభావంతులైన వ్యక్తులు ఉన్నారంటున్నారు.

అయితే తాజాగా దక్షిణాది సినిమా పరిశ్రమ గురించి సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల అమెజాన్ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నటి సోనాలి బింద్రే కన్నడ చిత్ర పరిశ్రమలో తనకు చేదు అనుభవం ఎదురైందన్నారు.

'నేను కొన్ని తెలుగు సినిమాల్లో నటించాను. మధ్యలో ఒక కన్నడ సినిమాలో యాక్ట్ చేశాను. కానీ ఆ సినిమాలో నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. దీంతో నేను మళ్ళీ కన్నడ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను.

'ఆ సంఘటన తరవాత నేను ఎప్పుడూ కన్నడ సినిమాలో నటించలేదు' అని సోనాలి చెప్పుకొచ్చింది. అయితే తనకు ఎదురైన చేదు అనుభవం ఏమిటో మాత్రం వెల్లడించలేదీ అందాల తార.

సోనాలి బింద్రే 'ప్రీత్సే' అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా, ఉపేంద్ర హీరోలుగా నటించారు. షారుఖ్ ఖాన్ నటించిన 'డర్' చిత్రానికి ఈ మూవీ రీమేక్. మరి ఈ మూవీ షూటింగ్ టైం లోనే తనకు చేదు అనుభవం ఎదురైందంటోంది సోనాలి.

సోనాలి బింద్రే 'మురారి' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిందీ . 2004లో విడుదలైన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' సోనాలి బింద్రే చివరి తెలుగు చిత్రం.దీని తర్వాత సోనాలి దాదాపు 10 సంవత్సరాల పాటు ఏ సినిమాలోనూ నటించలేదు




