- Telugu News Photo Gallery Cinema photos Masooda Movie Actress Bandhavi Sridhar Yellow Saree Stunning Photos Goes Viral
Bandhavi Sridhar : కోక చాటు కొంటె అందాలతో కైపెక్కిస్తున్న బాంధవి.. మసూద పిల్ల మత్తెక్కించిందిగా..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు బాంధవి శ్రీధర్. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కానీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Apr 02, 2025 | 9:28 AM

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దొచేసింది హీరోయిన్ బాంధవి శ్రీధర్. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన బాంధవి.. పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది.

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన మసూద సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఇందులో సంగీత కూతురిగా దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి అందర్ని భయపెట్టింది.

మసూద సినిమాతో ఇండస్ట్రీలో బాంధవికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఎల్లో కలర్ చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కైపెక్కించే చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది బాంధవి. ప్రస్తుతం ఈ అమ్మడు క్రేజీ స్టన్నింగ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

బాంధవి మిస్ ఇండియా రన్నరప్, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రప్రదేశ్ 2019 ప్రజెంట్స్ కూడా గెలుచుకుంది. గతంలో తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా ఫేమ్ మాత్రం రాలేదు.




