- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins like keerthy suresh smantha kajal doing skin show after their marriage
పెళ్లి తర్వాత కూడా స్కిన్ షోతో హీట్ పెంచేస్తున్న హీరోయిన్లు
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత మన హీరోయిన్లకు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా..? ఇప్పుడూ ఇదే జరుగుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకు దూరంగా ఉంటారంటారు కానీ వీళ్లేమో ఇంకా రెచ్చిపోతున్నారు. ఏంటి నమ్మరా.. ఒక్కసారి ఈ ముద్దుగుమ్మలను చూసేయండి.. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం..!
Updated on: Apr 01, 2025 | 10:05 PM

గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు.

ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు.

కీర్తి సురేష్‌నే తీసుకోండి.. పెళ్లికి ముందు ఈ భామ చాలా హద్దుల్లో ఉన్నారు.. కానీ ఎందుకో తెలియదు గానీ కుమారి నుంచి శ్రీమతిగా మారాక గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్నారు. బేబీ జాన్ కోసం భారీగానే అందాలారబోసిన కీర్తి.. తాజాగా ఫోటోషూట్స్‌లోనూ రెచ్చిపోతున్నారు. బయట కనిపించినపుడు కూడా గ్లామర్ షో చేస్తున్నారు బ్యూటీ.

కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు. సినిమాల్లో పద్దతిగానే కనిపిస్తున్న కాజల్.. ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు. మొన్న ఓ సినిమా ప్రమోషన్స్‌లో చాలా వరకు గ్లామర్‌గానే కనిపించారు చందమామ. ఇక రకుల్ అయితే పెళ్లి తర్వాతే డోస్ పెంచేసారు. ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయిప్పుడు.

ఇక విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన తర్వాత కూడా కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. నయనతార సైతం జవాన్‌లో నటించిన తర్వాతే హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్‌ను ముడిపెట్టట్లేదు.




