Bollywood: ఆ మూవీని మహారాష్ట్రలో విడుదల చేయద్దు.. శివసేన హెచ్చరిక.. ఇంతకీ ఏముందీ సినిమాలో?
ఫవాద్ ఖాన్, వీణా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. అయితే ఈ సినిమాను శివసేన తో పాటు ఎమ్ ఎన్ ఎస్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయడానికి అనుమతించబోమని హెచ్చరించాయి.

ఫవాద్ ఖాన్, వాణి కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘అభిర్ గులాల్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు అడ్డంకులు, ఆందోళనలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా విడుదలను అనుమతించబోమని MNS (మహారాష్ట్ర నవనిర్మాణ సేన), శివసేన హెచ్చరికలు జారీ చేశాయి. దీనికి ప్రధాన కారణమేంటంటే.. ఫవాద్ ఖాన్. అవును.. పాకిస్తాన్ కు చెందిన ఈ నటుడు తిరిగి ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఫవాద్ ఖాన్ గతంలో కరణ్ జోహార్ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’లో నటించాడు. ఆ సినిమా విడుదల సమయంలోనూ MNS, శివసేన నిరసనలకు దిగాయి. సినిమా థియేటర్ల దగ్గర ఆందోళనలు నిర్వహించాయి. దీని తర్వాత పాకిస్తానీ నటులు భారతీయ సినిమాల్లో నటించకుండా అనధికారిక నిషేధం విధించారు.
కాగా 2023లో పాకిస్తానీ నటులు భారతదేశంలో నటించకుండా, పాకిస్తానీ సినిమాలు భారతదేశంలో విడుదల కాకుండా నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఇటీవల పాకిస్తానీ సినిమాలు భారతదేశంలోనూ విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఫహద్ ఖాన్ కూడా భారతీయ సినిమా రంగంలోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఆర్తి ఎస్ బాగ్డి దర్శకత్వం వహించిన ‘అభిర్ గులాల్’ చిత్రం టీజర్ ఇప్పుడు విడుదలైంది. ఇది ఒక ప్రేమకథ, ఈ సినిమాను భారతదేశం, లండన్‌లో చిత్రీకరించారు.
అభిర్ గులాల్ సినిమా టీజర్..
The wait is over! Bringing love back to the big screen with Abir Gulaal and Fawad Khan. A Richer lens film @aricherlens_ . See you in the cinemas on 9th May! ❤️✨@aricherlens_ @vivekbagrawal @AvantikaH_A @AartiSBagdi @saregamaglobal #rakeshsippy #aarjaypictures#indianstories… pic.twitter.com/RcWAa9WIGQ
— Vaani Kapoor (@Vaaniofficial) April 1, 2025
అభిర్ గులాల్ సినిమా గురించి MNS సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు ఇలా మాట్లాడారు. ‘అభిర్ గులాల్’ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయడానికి మేము ఖచ్చితంగా అనుమతించబోం. ఈ సినిమా విడుదల గురించి మాకు ఇటీవలే తెలిసింది. ఈ సినిమాలో పాకిస్తానీ నటులు నటించారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నాము. ఆ తర్వాత, ఈ సినిమా గురించి వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తాం’ అని తెలిపారు.
Mumbai, Maharashtra: On Pakistani actor Fawad Khan’s upcoming film Abir Gulaal, MNS leader Amey Khopkar says, “We have always opposed Pakistani actors and films, and we will continue to do so. No film featuring a Pakistani artist will be released here, and no one should even… pic.twitter.com/8XejkbcN1e
— IANS (@ians_india) April 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి