Samantha Ruth Prabhu: నటి సమంత కోసం గుడి కట్టిన తెలుగు అభిమాని.. వీడియో సోషల్ మీడియాలో వైరల్..
ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసి.. వరస హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంతా రూత్ ప్రభు. ఇప్పుడు సమంతా రూత్ ప్రభు పాన్ ఇండియా హీరోయిన్. గత 2 సంవత్సరాలుగా సమంత ఏ సినిమాల్లోనూ నటించకపోయినా.. ఆమె అభిమానుల కొరత లేదు. తాజాగా సమంత మీద అభిమానాన్ని ఒక అభిమాని విభిన్నంగా చాటుకున్నారు. తెలుగింటి అబ్బాయి నటి సమంతకు గుడి కట్టించాడని ఒక వీడియో వైరల్ అవుతుంది.

సమంతా రూత్ ప్రభు 2010లో విన్నైతాండి వరువాయా చిత్రంలో అతిధి పాత్రతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తర్వాత “ఏ మాయ చేశావే” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఈ సినిమా విజయం తర్వాత సమంత కెరీర్ లో వెనుదిగిరి చూసుకోలేదు, తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాల్లో నటించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లో కూడా నటించి అభిమానులను అలరిస్తుంది. సమంత మంచి నటి మాత్రమే కాదు మంచితనం మానవత్వం ఉన్న మనిషి కూడా. ఎన్నో సామజిక కార్యక్రమాలను చేస్తూనే ఉంది. అయితే ఇటీవల ఒక అభిమాని సమంత కోసం ఒక గుడి కట్టించాడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దేనాలిలో హీరోయిన్ సమంత కోసం ఒక అభిమాని ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఆ ఆలయంలో నటి సమంత విగ్రహాన్ని పూజిస్తారని కూడా చెబుతారు. సమంతకు ఒక అభిమాని నిర్మించి దైవంగా పూజిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే బొమ్మకు ఆలయం ప్రస్తుతం నిర్మించబడలేదు. ఈ వార్త కొన్ని సంవత్సరాల క్రితం ప్రచురితమైంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
నటి సమంతా రూత్ ప్రభు:
View this post on Instagram
సమంత ప్రస్తుతం పాన్-ఇండియన్ హీరోయిన్లలో ఒకరు. సమంత నటించిన సినిమా విడుదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. బాలీవుడ్‌లో మాత్రమే ఆమె సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌లో ఆమె నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు తెలుగులో కొత్త సినిమాలో నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమంత ప్రస్తుతం సినిమాలు కూడా నిర్మిస్తోంది. సమంత నిర్మాణం, నటన, వ్యాపారం వంటి వివిధ రంగాలలో రాణిస్తోంది. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంటుంది.
వాస్తవానికి సినిమాల్లోని నటీనటులకు అభిమానులు గుడి కట్టించడం కొత్త కాదు. తమకు ఉన్న అపారమైన ప్రేమని తెలియజేస్తూ తమ అభిమాన నటీనటులకు ఆలయాలు నిర్మిస్తారు. రజనీకాంత్, ఖుష్బు, నమిత, నయనతార, నటి హన్సిక వంటి నటులకు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. ఒక అభిమాని తనకు గుడి కట్టి పుజిస్తున్నాడని తెలిసి అతనిని రజనీకాంత్ స్వయంగా కలిశాడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..