- Telugu News Photo Gallery Cinema photos Jyothika photos in a mesmerizing look in a gold colored dress
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సినిమాలతో పాటు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్, స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
Updated on: Apr 02, 2025 | 8:15 PM

తాజాగా ఈ ముద్దుగుమ్మ మెస్మరైజింగ్ లుక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మొదట్లో ఏలా ఉందో ఇప్పుడూ అలానే ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇప్పుడు నిర్మాతగా మారి తన భర్త సినిమాలు నిర్మిస్తుంది.

ఇక ఈ మధ్య ఈ చిన్నది తన చిత్రపరిశ్రమలోని స్నేహితులను ఇంటికి పిలిచి విందుభోజనం ఏర్పాటు చేసింది. అందరితో కలిసి సరదాగా కాసేపు ఏంజాయ్ చేసింది.

జ్యోతిక చివరగా తమిళ మూవీ ఉడన్నిరప్పే సినిమాలో కనిపించింది. తర్వాత ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాల్లో కనిపించి మెప్పించి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఈ అమ్మడు అందం చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.





























