Film Piracy: సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీ భూతం.. వైఫల్యం ఎవరిది?
టాలీవుడ్ రేంజ్ ఏంటో భారతీయ చిత్ర పరిశ్రమకే తెలిసిపోయింది. హైరేంజ్ బడ్జెట్ మూవీలు తీయగల ప్రొడ్యూసర్స్ టాలీవుడ్‌లోనే ఉన్నారని అర్థమైంది. డబ్బున్నవాళ్లు చాలామందే ఉన్నా.. సినిమా కోసం ఖర్చు పెట్టే గట్స్ ఉన్న నిర్మాతలు తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారిప్పుడు. కాని, ఆ స్ట్రెంథ్‌ని పైరసీని ఆపడంలో ఉపయోగించుకోవడం లేదు. మనకెందుకొచ్చిందిలే అనా?

ఓ సినిమా పైరసీ కాపీ మార్కెట్లోకి వచ్చిందనుకుందాం. వెంటనే ఓ కామన్ మ్యాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది. ‘భలే అయిందిలే.. తొలివారం రేట్లు పెంచుతారట, ఆ తరువాత తగ్గిస్తారట.. ఇష్టమొచ్చిన టికెట్ ధరలు, పాప్‌కార్న్‌కు ఏడెనిమిది వందలు’ అంటూ విసుక్కుంటాడు. పైరసీలో సినిమా చూడ్డానికి కొందరు చెప్పుకునే కారణమే తప్ప.. అందులో వాస్తవం లేదు. నిజంగా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకుంటే చూడక్కర్లేదు. వాళ్లేం బలవంతంగా తీసుకెళ్లి ప్రేక్షకుడితో ఖర్చుపెట్టించట్లేదుగా. ఒక రోజు ఆగితే రివ్యూ వచ్చేస్తోంది. లేదా పబ్లిక్ టాక్ తెలిసిపోతుంది. దాన్నిబట్టి సినిమాకు వెళ్లాలో వద్దో ప్రేక్షకుడి ఇష్టం. అంతేగానీ.. పైరసీని ఎంకరేజ్ చేయడం ఏంటి? ‘ఏం.. ఒక సినిమాకు 1500 ఖర్చుపెట్టలేరా’ అనే తలతిక్క సమాధానం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాంటోళ్లను వదిలేయండి. కాని, పైరసీ అనేది ఎంత మందిని చంపేస్తుందో తెలుసా. ఒక సినిమా వందల మంది కష్టం. కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్న ఒక పెద్ద రంగం. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకుండానే ఒక నిర్మాత వందల కోట్లు రూపాయలతో ఆడే ఒక రిస్కీ గేమ్ ఈ సినిమా. ఒక సినిమా విడుదలవ్వాలంటే.. ఒక్కోసారి రెండు మూడేళ్ల పాటు రక్తాన్ని, చెమటని, అంతకు మించిన హార్డ్‌వర్క్‌ని ధారపోయాల్సి ఉంటుంది. మూడు గంటల సినిమా కోసం మూడేళ్లు కష్టపడి తీస్తే.. పైసా ఖర్చు లేకుండా దాన్ని పైరసీలో చూడ్డం తప్పు కాదా? లక్షల మంది కడుపు...