Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా.. నిర్లక్షం వద్దు.. నిపుణుల సలహా

ప్రస్తుతం తినే ఆహారం, జీవనశైలి ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అందుకనే చిన్న ఆరోగ్య సమస్య కనిపించినా వెంటనే వాటికి సరైన చికిత్స చేయకపోతే.. అవి తరువాత తీవ్రమైన సమస్యలుగా మారవచ్చు. మెట్లు ఎక్కేటప్పుడు తప్పుడు భంగిమ.. కొన్ని తప్పులు తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరించారు. కీళ్ల నొప్పులను నివారించడానికి మెట్లు ఎక్కడానికి సరైన పద్ధతిని అనుసరించడం గురించి నిపుణులు ఇచ్చిన సలహా ఏమిటో తెలుసుకుందాం..

Health Tips: మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా.. నిర్లక్షం వద్దు.. నిపుణుల సలహా
Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2025 | 8:21 PM

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నలభై ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే తుంటి నొప్పి, మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ, కొంతమందికి నడవడం, తిరగడం కష్టమవుతుంది. అంతే కాదు మెట్లు ఎక్కడం ఒక సాధారణ కార్యకలాపం. సరిగ్గా మెట్లు ఎక్కకపోతే అది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని ముంబైలోని పరేల్‌లోని గ్లెనీగల్స్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎ. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు. ముంబైలోని పరేల్‌లోని గ్లెనీగల్స్ హాస్పిటల్‌లోని ఆర్థోపెడిక్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనుప్ ఖత్రి ఈ విషయాన్ని వివరించారు.

ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజీవ్ రాజ్ చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. మెట్లు ఎక్కే సమయంలో తప్పు భంగిమ ఉంటే.. అది కీళ్లను ఎలా ఒత్తిడికి గురి చేస్తుందో.. మెట్లు ఎక్కడానికి సరైన మార్గం గురించి చెప్పారు. “మీ కాలులో సగం భాగాన్ని మెట్లపై ఉంచే బదులు, మీ పూర్తి కాలును మెట్లపై ఉంచండి. ముందుగా మీ కుడి కాలును ఉంచండి. మీరు మీ బలహీనమైన కాలును ముందుగా ఉంచితే, మీ మోకాళ్లలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు” అని ఆయన వివరించారు.

డాక్టర్ అనుప్ ఖత్రి మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ చౌదరి వివరించిన కొన్ని అంశాలతో తాను ఏకీభవిస్తున్నానని.. నిటారుగా ఉండే భంగిమను నిర్వహించడం చాలా ముఖ్యమని చెప్పారు. మెట్లు ఎక్కేటప్పుడు మీ శరీరం దానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యమని అన్నారు. కొంతమంది మెట్లపైకి వేగంగా ఎక్కుతారు. ఇలా చేయకుండా సమయాన్ని వెచ్చించి నెమ్మదిగా మెట్లు ఎక్కండి. “ఇలా చేయడం వలన మీ మోకాళ్లపై అదనపు ఒత్తిడి తగ్గుతుందని అతను చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అలాగే హ్యాండ్‌రైల్ ఉపయోగించడం సహాయపడుతుంది. వీలైతే మెట్లు ఎక్కే సమయంలో బరువైన వస్తువులను మోయవద్దు. ఎందుకంటే ఇది మీ మోకాళ్లు , తుంటిపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. నొప్పిని పెంచుతుంది. మంచి నాణ్యత గల కుషన్డ్ బూట్లు, పాదరక్షలను ధరించండి. మీరు మెట్లు ఎక్కేటప్పుడు మీ కీళ్లలో భరించలేని నొప్పిని అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చిన్న సమస్యలను విస్మరించడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుందని డాక్టర్ అనుప్ అన్నారు.

“రోజుకు నలభై ఐదు నిమిషాల పాటు చేసే శారీరక శ్రమ, వ్యాయామం మోకాళ్లను బలపరుస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడానికి బదులుగా నడవడం వల్ల మోకాళ్లకు రక్త ప్రసరణ పెరుగుతుంది. “మీరు నడవలేకపోయినా.. లేదా కొంచెం సేపు నడిచినా నొప్పి అనిపిస్తే.. నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది” అని ఆయన అన్నారు.

మరిన్ని జీవనశైలి వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి