సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవే!
వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. భానుడు భగ భగలతో తన ప్రతాపం చూపెడుతున్నాడు. దీంతో చాలా మంది ఏదైనా పని కోసం బయటకు వెళ్లాలంటే, భయపడిపోతున్నారు. ఎందుకంటే విపరీతమైన వేడితో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది.
Updated on: Apr 02, 2025 | 8:06 PM

ముఖ్యంగా బయటకు వెళ్తే వడదెబ్బ తలగడం వలన అలసట వంటి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎప్పుడూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వలన అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాగా, సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

వేసవి రోజుల్లో మీ శరీరం చల్లగా ఉంచుకోవాలంట. తప్పకుండూ రోజూ ఎక్కవ మోతాదులో మంచి నీరు తాగడమే కాకుండా, హైడ్రేటింగ్ జ్యూస్‌లు తీసుకోవాలంట.

వేసవిలో చాలా వేడి ఉక్కపోత ఉంటుంది. అందువల ఇలాంటి సమయంలో వేడి నీటికంటే చన్నీటి స్నానమే ఉత్తమం. చల్లటి నీటితో స్నానం చేయడం వలన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు.

వేసవిలో ఎక్కువ నీరు ఉండే పండ్లను మాత్రమే తీసుకోవాలి. మీ ఆహారంలో హైడ్రేటెడ్ ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవడం వలన శరీరం చల్లగా ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేసవి రోజల్లో మీరు ధరించే దుస్తులు కూడా మీ శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపిస్తాయి. అందువలన తేలికగా, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం.



