Black Coffee: ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..
కాఫీ మనకు ఇష్టమైన పానీయాలలో ఒకటి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి కాఫీ తాగే అలవాటు ఉంది. కాఫీ తాగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. పని చేస్తున్నప్పుడు ఎక్కువ మానసిక ఒత్తిడి గురైతే.. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మనకు రిలీఫ్ అనిపిస్తుంది. ఆనందం, మనశ్శాంతి లభిస్తుంది. ఈ కాఫీలో రకరకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లాక్ కాఫీ. ఈ బ్లాక్ కాఫీని ఖాళీ కడుపుతో ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయో లేదో తెలుసుకుందాం..
Updated on: Apr 02, 2025 | 7:42 PM

కొంతమందికి ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిదా చెడ్డదా? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Black Coffee

Black coffee

గ్యాస్ట్రిటిస్, అల్సర్లు లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం కూడా మంచిది కాదు.

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి కూడా వస్తాయి. బ్లాక్ కాఫీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగవద్దు. అలాగే ఎవరైనా తీవ్ర ఒత్తిడితో బాధపడుతుంటే బ్లాక్ కాఫీ తాగడం మానేయడం మంచిది. ఇది మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.




