AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ కనుబొమ్మల ఆకారం మీరు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవారో తెలియజేస్తుంది..

ప్రపంచాన్ని మనకు చూపించే కన్నులకు రక్షణ ఇచ్చేవి కనుబొమ్మలు. కనుబొమ్మలు కళ్ళను దుమ్ము, ధూళి, చెమట నుంచి రక్షణ ఇస్తాయి. అంతేకాదు కను బొమ్మలు కోపం, ఆశ్చర్యం, ఉత్సాహం వంటి భావోద్వేగాలు ప్రదర్శించి చెప్పకనే మన భావాలను ఇతరులకు చెప్పేందుకు కీలక పాత్రను పోషిస్తాయి. అయితే అందరికీ ఒకేలా కనుబొమ్మలు ఉండవు. మీ కనుబొమ్మల ఆకారం బట్టి మీ వ్యక్తిత్వం తెలుస్తుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. మీ కనుబొమ్మలు మీ గురించి ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం..

Personality Test: మీ కనుబొమ్మల ఆకారం మీరు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవారో తెలియజేస్తుంది..
Personality Test
Surya Kala
|

Updated on: Apr 02, 2025 | 5:53 PM

Share

ఎవరి కనుబొమ్మలు మరొకరి కనుబొమ్మల మాదిరిగా ఉండవు. ఒకొక్కరి కనుబొమ్మలు ఒకొక్క విధంగా ఉంటాయి. కొందరిలో మందపాటిగా ఉంటే, మరికొందరిలో సన్నవిగా ఉంటాయి. నిటారుగా, వంపుతిరిగిన వంటి విభిన్న ఆకారాలుగా కను బొమ్మలు ఉంటాయి. వీటి ఆకారం ఆధారంగా మనిషి వ్యక్తిత్వ లక్షణాలు, భావోద్వేగ అంశాలు, మేధస్సు స్థాయిల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది అనేక అధ్యయనాల ద్వారా నిర్ధారించబడింది. ఈ రోజు మనిషిలో కనుబొమ్మ ఆకారాల గురించి.. అవి ఎటువంటి వ్యక్తితాన్ని సూచిస్తాయో తెలుసుకుందాం..

మందపాటి కనుబొమ్మలు: మందపాటి కనుబొమ్మలు ఉంటే.. వీరు సొంత మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతిదానిలోనూ అందాన్ని చూస్తారు. మంచిని నేరుగా అభినందిస్తారు. ఇతరులు మీ గురించి ఎలా ఆలోచిస్తారో లేదా ఎలా అనుకుంటారో అనే చింత ఉండదు. పరిపూర్ణత కోసం వీరు జీవితాంతం అన్వేషణ సాగిస్తారు. జీవితాన్ని తమ ఆదర్శాలు, ఆలోచనల ప్రకారం నిర్మించుకుంటారు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. కనుక వీరు తీసుకునే నిర్ణయాలు నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో ఉంటాయి. అలాగే తార్కిక వ్యక్తిత్వం వీరి సొంతం. కనుక భావోద్వేగ ఒడిదుడుకుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. లక్ష్యానికి అడ్డుగా ఉండే విషయాలను వీరు విస్మరిస్తారు.

సన్నని కనుబొమ్మలు: సన్నని కనుబొమ్మలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కనుక వీరు నిర్ణయం తీసుకోవడానికి సంకోచిస్తారు. ఇతరుల సహాయం తీసుకోవాలనుకుంటారు. వీరికి ధైర్యం కూడా ఉండదు. ప్రతి పనిని ఎలా చేయాలా అని అతిగా ఆలోచిస్తారు. దీంతో ఒత్తిడికి గురవుతారు. ప్రతిదానికీ ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడతారు.

ఇవి కూడా చదవండి

వంపు కనుబొమ్మలు: మీకు వంపు కనుబొమ్మలు ఉంటే, మీకు ఆశయం, ఓర్పు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అర్థం. మీరు ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పడం కంటే మధురమైన భావాలతో ఇతరులకు తెలియజేయడానికి ఇష్టపడతారు. మీరు మీ చుట్టూ ఉన్నవారిని మీ ఉల్లాసమైన వైఖరితో ఆకర్షిస్తారు. మాట్లాడే నైపుణ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. ఇతరులు మీ దగ్గరకు వస్తారు. అయితే మీరు ఎవరినైనా మనసుకి దగ్గరగా చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాగే మీ భావోద్వేగ ప్రతిస్పందన బలంగా, ప్రభావవంతంగా ఉంటుంది.

నిటారుగా ఉండే కనుబొమ్మలు: మీకు నిటారుగా ఉండే కనుబొమ్మలు ఉంటే.. మీరు తర్కానికి ఎక్కువ శ్రద్ధ చూపే వ్యక్తి. మీ హృదయం భావోద్వేగాని గురవుతూ ఉంటుంది. దీనిని అధిగమించడానికి మీరు జాగ్రత్తగా సాధన చేశారు. వీరు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే మేధావి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను వేరుగా ఉంచుకునే సామర్థ్యంవీరికి ఉంది. అందుకే కెరీర్ పరంగా వీరి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మానసికంగా స్థిరంగా ఉన్న వ్యక్తులను కూడా ఇష్టపడతారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం మీ స్వభావం కాదు. మిమ్మల్ని రక్షించేది మీ పట్టుదల, ఏకాగ్రత.

ముడుతలున్న కనుబొమ్మలు: ముడుతలున్న కనుబొమ్మలు ఉన్నావారు ప్రపంచం తమ గురించి ఎలా ఆలోచిస్తుందో అని పెద్దగా ఆలోచించరు. అయితే వీరి ఆలోచనలు, సృజనాత్మకత కారణంగా ప్రజలు వీరి వైపు ఆకర్షితులవుతారు. స్వేచ్ఛాయుతమైన.. ఆకస్మిక ఆలోచనలను ఒకే సమయంలో గ్రహించలేదు. వీరు అశాంతితో తీసుకునే ఆలోచనలు ఇతరులను ఇబ్బందికి గురి చేస్తాయి. వీరు పగటి కలలు కంతారు. దీని కారణంగా, మనస్సు తరచుగా కలత చెందుతుంది.

కనుబొమ్మల మధ్య గ్యాప్ ఉంటే: ఎవరి కనుబొమ్మల మధ్య అయినా ఎక్కువ గ్యాప్ ఉంటే వీరిని ఇతరులు చాలా ఇష్టపడతారు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తారు. ముక్కుసూటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ.. బయటి ప్రపంచం వీరిని సులభంగా ప్రభావితం చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడానికి వెళ్లి వీరు ఇబ్బందుల్లో పడతారు. కొన్నిసార్లు వీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తప్పు మార్గంలోకి నడిపిస్తాయి. దానికి కారణం విపరీతమైన భావోద్వేగమే. ముందుచూపు లేకుండా వ్యవహరించే ధోరణి వీరి జీవిత గమనాన్ని నడిపిస్తుంది. వీరు చెప్పే విషయాల పట్ల ప్రజలు ఆకర్షిలవుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)