Nita Ambani: కొడుకు కోసం మొదలుపెట్టి.. ట్రెండ్ సెట్ చేసింది.. నీతా అంబానీ బరువు తగ్గేందుకు ఏం చేస్తుందో తెలిస్తే షాకవుతారు
ఫిట్ నెస్ విషయంలో నీతా అంబానీ సరికొత్త ట్రెండ్ సెట్ చేశారంటే ఆశ్చర్యంలేదు. ఈవెంట్ ఏదైనా సరే తనదైన కట్టుబొట్టుతో పాటు ఫిట్ గా కనిపిస్తూ ఈ వయసులోనూ అందరి ఫోకస్ తనపై నిలుపుకుంటారు. తన డైట్, డైలీ రొటీన్ విషయాలను ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండవచ్చని ఆమె నిరూపించారు. ఆ సీక్రెట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి..

ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ చర్చలో ఉండే నీతా అంబానీ ఒకప్పుడు అధిక బరువుతో బాధపడేవారట. ఆమె 90 కిలోల బరువుతో ఉండేవారు. కానీ, ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కఠినమైన డైట్ ప్లాన్, పరిమితి ఎక్సర్ సైజ్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆమె దాదాపు 18 కిలోల బరువు తగ్గారు. ఆమె ఈ అద్భుతమైన మార్పును ఎలా సాధించిందో తెలుసుకుని ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే నీతా అంబానీ చెప్తున్నవేవీ డబ్బులతో కూడుకువి కాదు. ఎవరైనా తేలికగా చేసుకోవచ్చు. అందుకే నీతా అంబానీ ఫిట్ నెస్ నెట్టింట చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఆమె ఉన్నట్టుండి 18 కిలోల బరువు తగ్గేందుకు ఏమేం చేసిందో మీరూ తెలుసుకోండి.
బరువు తగ్గడానికి మోటివేషన్ ఇదే..
నీతా అంబానీ తన వెయిట్ లాస్ జర్నీని తన కుమారుడు అనంత్ అంబానీ కోసం ప్రారంభించారు. తన కుమారుడిని ప్రేరేపించడానికి ఆమె వర్కౌట్ డైట్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈ కృషితో ఆమె ఏకంగా 18 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వర్కౌట్‌ను ఎప్పటికీ వదలరు
60 ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ తన వ్యాయామాన్ని ఎప్పుడూ మిస్ చేయరు. ప్రతి రోజూ జిమ్ సెషన్‌లతో పాటు యోగా, ఈత, డ్యాన్స్‌ను ఆమె తన రొటీన్‌లో భాగం చేసుకున్నారు. డ్యాన్స్ పట్ల ఆమెకున్న ఇష్టం కూడా ఆమె వర్కౌట్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.
ప్రతి రోజూ బీట్‌రూట్ జ్యూస్
నీతా అంబానీ ఫిట్‌నెస్‌తో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకుంటారు. దీని రహస్యం బీట్‌రూట్ జ్యూస్. ప్రతి రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మంపై మెరుపు వస్తుందని, అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు కూడా చెప్తున్నారు.
ప్రోటీన్ ఆధారిత ఆహారం
బరువు తగ్గడానికి నీతా అంబానీ తన ఆహారంలో ప్రోటీన్‌ను ఎక్కువగా చేర్చుకుంటారు. ఉదయం అల్పాహారంలో గుడ్డు తెల్లసొనతో చేసిన ఆమ్లెట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తూ బరువును నియంత్రిస్తుంది.
కూరగాయలతో నిండిన ప్లేట్
ఆమె ఆహారంలో ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు ఉంటాయి. కొన్నిసార్లు ఆమె భోజనంలో కేవలం కూరగాయల సూప్ మాత్రమే తీసుకుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రాత్రి భోజనంలో స్ప్రౌట్స్
బరువు తగ్గడానికి నీతా అంబానీ రాత్రి భోజనంలో పోషకాలతో నిండిన స్ప్రౌట్స్‌ను తీసుకుంటారు. ఇవి జీవక్రియను పెంచి, బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.