Tollywood: 30 కోట్ల ఆస్తి ఉన్నా బైక్‌పైనే వెళ్లే స్టార్ హీరోయిన్.. వీడియో చూసి ఎవరో గుర్తు పట్టండి
సాధారణంగా సినిమా తారలు ఎక్కువగా లగ్జరీ లైఫ్ నే లీడ్ చేస్తుంటారు. విలాసవంతమైన బంగ్లాలలో నివసిస్తుంటారు. ఖరీదైన కార్లలో ప్రయాణిస్తుంటారు. కానీ ఈ స్టార్ హీరోయిన్ మాత్రం ఎక్కడికెళ్లినా బైక్ పైనే వెళతానంటోంది. అలాగనీ ఆమెకున్న ఆస్తులేమీ తక్కువ కాదు. సుమారు రూ. 30 కోట్లకు పైగా ఆస్తిపాస్తులున్న స్థితిమంతురాలు.

సాధారణంగా సినిమా తారలు లగ్జరీ కార్లలో తిరిగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జిమ్ లు , షాపింగ్ లు, షూటింగ్ స్పాట్ కు, ఆఖరికి చిన్న దూరానికైనా కార్లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్. కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ సింపుల్ గా బైక్ పైనే వెళుతుంటుంది. ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు ఆరేళ్లయ్యింది. అయితే గతేడాది వరకు ఈ బ్యూటీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఒకే ఒక సినిమా ఈ సొగసరిని ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు ఉన్న డిమాండ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపొద్ది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోటి నుంచి 3 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటుందీ అందాల తార. అలాగే సోషల్ మీడియాలో తన కున్న క్రేజ్ ను వినియోగించుకుంటూ ఒక్కో ఇన్ స్టా యాడ్ పోస్ట్ కి లక్షల ఆదాయం ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 30 కోట్లకు పైగానే ఉంటుంది. అయితేనేం సింపుల్ గానే ఉండడానికే ఇష్టపడుతోందీ క్రేజీ హీరోయిన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ బైక్ పై సింపుల్ గా జర్నీ చేస్తూ కనిపించింది. ఇప్పుడే గతంలోనూ పలు సార్లు ఇలాగే బైక్ పైనే జర్నీ చేస్తూ దర్శనమిచ్చింది. దీంతో సినీ అభిమానులు ఈ హీరోయిన్ సింప్లిసిటీని తెగ పొగిడేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి
ముంబై నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే బైక్ పైనే వెళ్లడం సురక్షితమంటోంది తృప్తి దిమ్రి. అందుకే తాను బైక్ జర్నీకే ప్రాధాన్యమిస్తానంటోందీ అందాల తార. తాజాగా ముంబై రోడ్లపై బైక్ పై షికారు చేస్తూ కనిపించింది తృప్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ముంబై ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.
బైక్ పై తృప్తి దిమ్రి.. వీడియో..
View this post on Instagram
యానిమల్ తర్వాత బ్యాడ్ న్యూస్, భూల్ భూలయ్యా 3 తదితర సినిమాల్లో నటించింది తృప్తి దిమ్రి. ప్రస్తుతం ధడక్ 2 తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఈ బాలీవుడ్ బ్యూటీ చేతిలో ఉన్నాయి.
యానిమల్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.