గొరిల్లాకు దాహమేసింది! ఆ వ్యక్తి ఏం చేసాడో చూస్తే
మంచితనం, మానవత్వం మనుషుల్లో కనుమరుగవుతున్న వేళ చేతనైన సాయం చేసి గొరిల్లాకు సాంత్వన కలిగించాడో వ్యక్తి. అలాంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. దాహంతో ఉన్న గొరిల్లాకు ఆ వ్యక్తి చేసిన సహాయం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్ని జంతువులు అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుంటాయి.
అందులో గొరిల్లాలు ముందుంటాయి. మనుషుల్లానే ఆలోచిస్తూ, మనుషుల్లానే అన్ని రకాల పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ వైరల్ కావడం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓ గొరిల్లా ఓ వ్యక్తితో స్నేహం చేసింది. ఆ వ్యక్తి గొరిల్లాకు ప్రేమగా తాగునీరు అందించి దాహార్తి తీర్చాడు. తన రెండు చేతులను కప్‌లాగా చేసుకుని పక్కనే ఉన్న నీటి కుంట నుంచి తాగునీరు దోసిలిలో పట్టి గొరిల్లాకు అందించాడు. దీన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆ తర్వాత థ్యాంక్స్ చెబుతున్నట్లుగా గొరిల్లా ఆ వ్యక్తిని బుగ్గపై ముద్దు పెట్టుకుంది. అది చూసి ఈ ఇద్దరు అసలు సిసలైన స్నేహితులని వీడియో తమ గుండెల్ని పిండేసిందని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు నీరు తాగుతున్న గొరిల్లా తల అతని తలను తాకింది. జంతువులను ప్రేమగా చూసే ఆ వ్యక్తి మానవత్వానికే మచ్చుతునక అంటూ నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ప్రైవేట్ దావత్‌లో రామ్ చరణ్.. వైరల్ వీడియో
ఆదిత్య 369 రీ రిలీజ్.. ఫస్ట్ ఛాయిస్ మోహిని కాదట..!
Allu Arjun: పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
