భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే దేశాలు ఇవే.. ఓ లుక్ వేయండి 

07 March 2025

Pic credit-Pexel

TV9 Telugu

భారతీయులు జర్మనీకి వెళ్ళిన తేదీ నుంచి ఆరు నెలల వరకు చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో జర్మనీలో డ్రైవ్ చేయవచ్చు. అయితే అంతర్జాతీయ డ్రైవర్ పర్మిట్ (IDP) కలిగి ఉండటం మంచిది.

జర్మనీ

ఇక్కడ కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. అయితే అది ఇంగ్లీషులో ఉండాలి. డ్రైవింగ్ చేయడానికి 18 ఏళ్లు పైబడి ఉండాలి.

స్విట్జర్లాండ్

21 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే .. చెల్లుబాటు అయ్యే భారతీయ లైసెన్స్ కలిగి ఉంటే న్యూజిలాండ్‌లో డ్రైవ్ చేయవచ్చు. ఈ లైసెన్స్ ఇంగ్లీషులో లేకపోతే.. అధికారిక అనువాదం లేదా IDPని కలిగి ఉండాలి.

న్యూజిలాండ్

భారతీయ లైసెన్స్ హోల్డర్లు అదనపు పరీక్షలు లేకుండానే ఫ్రాన్స్‌లో ఒక సంవత్సరం వరకు డ్రైవ్ చేయవచ్చు. అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ కు ఫ్రెంచ్ అనువాదం అవసరం.

ఫ్రాన్స్

చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలా ఆస్ట్రేలియన్ రాష్ట్రాల్లో మూడు నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు. అయితే లైసెన్స్ లో పేర్కొన్న వాహన తరగతులలో మాత్రమే డ్రైవ్ చెయ్యాలి.

ఆస్ట్రేలియా

భారతీయ లైసెన్స్‌తో సింగపూర్‌లో చట్టబద్ధంగా ఒక సంవత్సరం పాటు డ్రైవ్ చేయవచ్చు. అది ఇంగ్లీషులో ఉండాలి లేదా స్థానిక ట్రాఫిక్ నియమాల పరిజ్ఞానంతో పాటు అనువాద వెర్షన్‌ను కలిగి ఉండాలి.

సింగపూర్

భారతీయ పర్యాటకులు తమ భారతీయ లైసెన్స్‌ని ఉపయోగించి మూడు నెలల పాటు నార్వేలో డ్రైవ్ చేయవచ్చు. IDPని తీసుకెళ్లడం సహాయకరంగా ఉంటుంది.

నార్వే

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. అయితే కొన్ని రకాల వాహనాలను అనుమతించకపోవచ్చు. కనుక అద్దెకు తీసుకునే ముందు తనిఖీ చేయాల్సి ఉంటుంది.

యునైటెడ్ కింగ్‌డమ్

భారతీయ లైసెన్స్ ఉన్నవారు కెనడాలో వచ్చిన తేదీ నుంచి 60 రోజుల వరకు డ్రైవ్ చేయవచ్చు. ఒకవేళ ఎక్కువ కాలం ఉంటున్నట్లయితే స్థానిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం అవసరం.

కెనడా

భారతీయ లైసెన్స్ ఇంగ్లీషులో ఉంటే మారిషస్‌లో డ్రైవ్ చేయవచ్చు. నాలుగు వారాలపాటు చెల్లుబాటు అవుతుంది. IDP అవసరం లేదు కానీ వెరిఫికేషన్ విషయంలో ఇది ఉపయోగపడుతుంది.

మారిషస్