గ్రీన్ కార్డ్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేంటి?

గ్రీన్ కార్డ్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేంటి?

image

Balaraju Goud

21 March 2025

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్‌కు తిరిగి వచ్చినప్పటి నుండి కొత్త వలసల విధానంతో మెరుగైన జీవితం కోసం విదేశాల నుండి అమెరికాకు రావడం కష్టంగా మారింది.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్‌కు తిరిగి వచ్చినప్పటి నుండి కొత్త వలసల విధానంతో మెరుగైన జీవితం కోసం విదేశాల నుండి అమెరికాకు రావడం కష్టంగా మారింది.

ఇప్పుడు వలసల అంశంపై, అమెరికా దేశం ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ గ్రీన్ కార్డ్ గురించి కీలక ప్రకటన చేశారు.

ఇప్పుడు వలసల అంశంపై, అమెరికా దేశం ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ గ్రీన్ కార్డ్ గురించి కీలక ప్రకటన చేశారు.

గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికాలో శాశ్వతంగా ఉండలేరని యూఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా స్పష్టం చేశారు.

గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికాలో శాశ్వతంగా ఉండలేరని యూఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా స్పష్టం చేశారు.

"శాశ్వత" అనే పదానికి మోసపోవద్దని అమెరికాలో నివాసం ఉంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వాన్స్ సూచించారు.

గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు అమెరికాలో నిరవధికంగా ఉండటానికి హక్కు లేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అన్నారు.

గ్రీన్ కార్డ్, పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ అని కూడా పిలుస్తారు. ఇది యుఎస్ కాని పౌరులు యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వతంగా నివసించడానికి,పని చేయడానికి అనుమతించే పత్రం.

గ్రీన్ కార్డ్ పొందిన తర్వాత, మీరు అమెరికాలో శాశ్వతంగా నివసించవచ్చు. అమెరికన్ పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

నివాసం జీవితకాల హామీ కాదని వాన్స్ స్పష్టం చేశారు. ఎవరైనా ఉండాలనుకుంటే, "వారికి ఇక్కడ ఉండటానికి చట్టపరమైన హక్కు లేదు - అది అంత సులభం కాదు" అని క్లారిటీ ఇచ్చారు.