AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attack on Sikhs: న్యూయార్క్‌లో సిక్కులపై జాతి వివక్ష దాడులు.. పది రోజుల వ్యవధిలో ముగ్గురిపై దాడి

అమెరికా న్యూయార్క్‌లో సిక్కులపై జాతి వివక్ష దాడులు కలకలం రేపుతున్నాయి.. రిచ్‌మండ్‌ హిల్స్‌లో తాజాగా ఇద్దరు సిక్కులపై దాడులు జరిగాయి..

Attack on Sikhs: న్యూయార్క్‌లో సిక్కులపై జాతి వివక్ష దాడులు..  పది రోజుల వ్యవధిలో ముగ్గురిపై దాడి
Sikh Men Attacked
Balaraju Goud
|

Updated on: Apr 13, 2022 | 6:50 PM

Share

Attack on Sikhs in US: అమెరికా(America) న్యూయార్క్‌(New York)లో సిక్కులపై జాతి వివక్ష దాడులు కలకలం రేపుతున్నాయి.. రిచ్‌మండ్‌ హిల్స్‌లో తాజాగా ఇద్దరు సిక్కులపై దాడులు జరిగాయి.. ఈ పది రోజుల వ్యవధిలో ముగ్గురు సిక్కుల మీద విద్వేషపూరిత దాడులు జరిగాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఇక్కడ ఒక వృద్ధ సిక్కుపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలను న్యూయార్క్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఖండించింది.. కాగా దాడులకు పాల్పడ్డ ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతనిపై హేట్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఇద్దరు సిక్కుల మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వారిని ఒక రాడ్‌తో కొట్టి తలపాగా లాగేశారు.. ఈ ఘటనను స్థానిక సిక్కులు, తోటి భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండించారు, ఇది ఖండనీయమైనదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులతో తాము టచ్‌లో ఉన్నామని చెప్పారు.

కాగా పది రోజుల క్రితం న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌ క్వీన్స్‌ ఏరియాలో 60 ఏళ్ల వృద్దుడు నిర్మల్‌ సింగ్‌ మీద ఇదే తరహాలో దాడి జరిగింది.. ఆయనపై ఇద్దరు వ్యక్తులు వెనుక వైపు నుంచి దాడి చేసి కొట్టారు ఈ ఘటనలో ఆయన ముక్కు విరిగింది.. నిర్మల్‌ సింగ్‌ పంజాబీ తప్ప వేరే భాష మాట్లాడలేడు.. భారత్‌ నుంచి వచ్చి తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు.. ఆయన మీద గుర్తు తెలియని వ్యక్తులు అకారణంగా దాడి చేశారు.. పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్టు చేశారు.. న్యూయార్క్‌లో పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు సిక్కుల మీద దాడి జరగం ఆందోళనకు గురి చేస్తోంది పదే పదే సిక్కుల మీద దాడి జరగడాన్ని సిక్కు సమాజం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో, JFK అంతర్జాతీయ విమానాశ్రయంలో సిక్కు టాక్సీ డ్రైవర్‌పై దాడి జరిగింది. అందులో దాడి చేసిన వ్యక్తి అతనిని తలపాగాలతో ఉన్న వ్యక్తులు అని పిలిచి తన దేశానికి తిరిగి రావాలని కోరాడు. న్యూయార్క్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్నికైన మొదటి పంజాబీ అమెరికన్ జెన్నిఫర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో సిక్కు సమాజంపై విద్వేషపూరిత నేరాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.

Read Also….  Nawab Malik: మనీలాండరింగ్ కేసులో ED దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన 8 ఆస్తుల జప్తు

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ