AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nawab Malik: మనీలాండరింగ్ కేసులో ED దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన 8 ఆస్తుల జప్తు

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్‌కు సంబంధించిన కళంకిత ల్యాండ్ డీల్‌తో తలెత్తిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 62 ఏళ్ల మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.

Nawab Malik: మనీలాండరింగ్ కేసులో ED దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన  8 ఆస్తుల జప్తు
Nawab Malik
Balaraju Goud
|

Updated on: Apr 13, 2022 | 6:30 PM

Share

Maharashtra Money laundering case: మహారాష్ట్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్‌కు చెందిన 8 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ ఆస్తులలో గోవా కాంపౌండ్, కుర్లా వెస్ట్‌లోని కమర్షియల్ యూనిట్, ఉస్మానాబాద్‌లో 59.81 ఎకరాల వ్యవసాయ భూమి, కుర్లా వెస్ట్‌లో మూడు ఫ్లాట్లు, బాంద్రా వెస్ట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. మాలిక్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్‌కు సంబంధించిన కళంకిత ల్యాండ్ డీల్‌తో తలెత్తిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 62 ఏళ్ల మాలిక్‌ను ఫిబ్రవరి 23న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అప్పటి నుండి కస్టడీలో కొనసాగుతున్న మాలిక్, ఇడి కేసును రద్దు చేయాలని గత వారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ అతని పిటిషన్‌ను తిరస్కరించారు. దీని తరువాత, PMLA ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 4 న మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. నవాబ్ మాలిక్ ఇప్పుడు ఏప్రిల్ 18 వరకు జైలులో ఉంటాడు. అయితే ఇంటి ఆహారం, మందులకు కోర్టు అనుమతి ఇచ్చింది. అంతకుముందు, జ్యుడీషియల్ కస్టడీ సమయంలో తనకు మంచం, పరుపు, కుర్చీ ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తిని ఆమోదించారు.

ఇదిలావుంటే, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి నవాబ్ మాలిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ పీఎంఎల్‌ఏ చట్టాన్ని ఉటంకిస్తూ మొత్తం కేసును త్వరగా విచారించాలని డిమాండ్ చేశారు. పీఎంఎల్‌ఏ చట్టం 2005లో అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం ED చర్య తీసుకుంటున్న లావాదేవీలు 2000 లేదా అంతకు ముందు జరిగినవి. ఈ అంశంపై త్వరగా విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారు.

Read Also….  Sucharitha Meets Jagan: అలక వీడిన మాజీ హోంమంత్రి.. ఏ లేఖ రాసినా రాజీనామానే అవుతుందా?: సుచరిత