Bomb Hoax: రైలులో బాంబు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు.. యువకుడి సమధానంతో పోలీసులకు షాక్

రైల్లో బాంబు(Bomb in Train) ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. రైలులో బాంబు ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా....

Bomb Hoax: రైలులో బాంబు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు.. యువకుడి సమధానంతో పోలీసులకు షాక్
Bomb In Train
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 14, 2022 | 7:16 AM

రైల్లో బాంబు(Bomb in Train) ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. రైలులో బాంబు ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని కాల్ చేసినట్లు ఆ యువకుడు చెప్పడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. రైలులో బాంబు ఉందంటూ డయిల్‌ 100కు బుధవారం ఓ ఆకతాయి ఫోన్ చేశాడు. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి సికింద్రాబాద్‌కు(Secunderabad) వస్తున్న రైల్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో రైల్వేతో పాటు స్థానిక పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. అప్పటికే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటలో ఉండటంతో అక్కడే నిలిపి తనిఖీలు చేపట్టారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోగా అక్కడ తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఆకతాయి ఫోన్‌ కాల్‌ గా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.

రైళ్లు వేర్వేరు సమయాల్లో సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకున్నప్పటికీ.. స్థానిక పోలీసులతో కలిసి జీఆర్పీ, ఆర్పీఎఫ్‌, బాంబుస్వ్కాడ్‌, డాగ్‌స్వ్కాడ్‌ బృందాలు రైళ్లు, రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశాయి. రైలులో బాంబు పెట్టామని ఫోన్‌ చేసిన ఆకతాయిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఒడిశాలో ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో నిందితుడు కార్తీక్‌ ఆకతాయిగా డయిల్‌ 100కు ఫోన్‌ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Also Read

Horoscope Today: వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు.. ఆకస్మిక ధననష్టం ఉంటుంది.. గురువారం రాశిఫలాలు..

Big Bazaar Cheating: ఆఫర్ల పేరుతో ‘బిగ్’ చీటింగ్.. మ్యాటర్ తెలిసి బోరుమంటున్న బాధితులు..!

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!