AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒరే బుడ్డొడా ఏంట్రా ఇదీ.. ఒక్క దెబ్బతో చదువంతా బుర్రకెక్కాలట.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

Viral Video: ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు..

Viral Video: ఒరే బుడ్డొడా ఏంట్రా ఇదీ.. ఒక్క దెబ్బతో చదువంతా బుర్రకెక్కాలట.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!
Boy
Shiva Prajapati
|

Updated on: Apr 14, 2022 | 7:00 AM

Share

Viral Video: ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు కాస్త షాకింగ్‌గా ఉంటాయి, మరికొన్ని వీడియోలు ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. ఇంకొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. సాధారణంగా కొంతమంది చిన్న పిల్లలు బడికి వెళ్లాలంటే మొండి చేస్తారు. మరికొందరికి.. స్కూల్‌కి వెళ్లినా చదవాలని అనిపించదు. దాంతో ప్రత్యామ్నాయ దారులు వెతుకుతుంటారు. ఇక పరీక్షలు వచ్చాయంటే చాలు.. తమలోని ప్రతిభనంతా బయటపెడతారు. కొందరు చిట్టీలు కొట్టేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు ఇంకో రకంగా ప్రయత్నిస్తారు. ఇక జీనియస్‌లు అయితే.. ఈ వీడియోలో చేసినట్లుగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అవును.. మనం చాలాసార్లు అనుకునే ఉంటాం. ఇవేం చదువులు రా బాబూ.. ఒకసారి చూడగానే రోబో మాదిరిగా బుర్రకెక్కితే బాగుంటుందని అనుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. కొందరైతే.. పుస్తకాలను తలగడగా పెట్టుకుంటే చదువు బుర్రకెక్కిద్ది అనే ఫన్నీ ఆలోచన కూడా చేస్తారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని బాలుడు కూడా ఈ కోవకు చెందిన వాడే. ‘రోబో’ సినిమాలో గాక ‘చిట్టి’ పుస్తకాలన్నీ నిమిషాల్లో స్కాన్ చేసిన చదవినట్లు.. వీడియో కొత్త ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం చూస్తే నవ్వు ఆపుకోలేరు.

పరీక్షలు ఉన్నాయో ఏమో గానీ.. స్కూల్‌ తరగతిలో విద్యార్థులందరూ తెగ సీరియస్‌గా చదువుతున్నారు. కానీ, ఒక్కడు మాత్రం పూర్తి భిన్నంగా ప్రవర్శించి అందరికీ షాక్ ఇచ్చాడు. చదువుకోకుండా పరీక్ష ఎలా రాయాలా? పుస్తకంలోని సబ్జెక్ట్ అంతా ఎలా గుర్తుండాలా? అని డీప్‌గా థింక్ చేశాడు. ఇంకేముందు.. అచ్చం రోబో మాదిరిగానే చేశాడు. రోబో కళ్లతో స్కాన్ చేస్తే.. మనోడు మాత్రం ఏదో మంత్రొచ్ఛారణ మాదిరి.. మాయ చేయబోయాడు. పుస్తకంలో ప్రతీ పేజీ చేతిలో తీస్తూ.. అందులోని సమాచారాన్నంతా రెండు చేతులతో తన బుర్రలోకి ఎక్కించుకుంటున్నట్లుగా విన్యాసాలు చేశాడు. అలా మొత్తం పేజీలను చకచకా తిరగేస్తూ.. చదవకుండానే సబ్జెక్ట్ అంతా వచ్చేలా చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేశాడు. చిన్నొడి చర్యలను స్కూల్ టీచర్ వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను తాజాగా ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్‌ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకు 1.63 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 11 మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!

Viral Video: ఇది కదా రాజసం అంటే.. ఈ పిల్లి వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!