Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: యుజ్వేంద్ర చాహల్‌కి తిరుగులేదు.. రేసులోకి చేరిన ఓడియన్ స్మిత్..!

IPL 2022: IPL 2022లో బుధవారం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ తర్వాత పర్పుల్ క్యాప్ రేసులో పెద్దగా మార్పు లేదు.

IPL 2022: యుజ్వేంద్ర చాహల్‌కి తిరుగులేదు.. రేసులోకి చేరిన ఓడియన్ స్మిత్..!
Mi Vs Pbks
Follow us
uppula Raju

|

Updated on: Apr 14, 2022 | 7:02 AM

IPL 2022: IPL 2022లో బుధవారం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ తర్వాత పర్పుల్ క్యాప్ రేసులో పెద్దగా మార్పు లేదు. అయితే అత్యధిక వికెట్ల రేసులో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ బౌలర్లు ఎవరూ తొలి మూడు స్థానాలకు చేరుకోలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్‌ను నిలబెట్టుకున్నాడు. అయితే అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్‌తో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. చాహల్ కంటే ముందు ఈ క్యాప్ ఉమేష్ తలపై ఉండేది. ప్రతి సంవత్సరం పర్పుల్ క్యాప్ రేసులో చాలా మంది బౌలర్లు కనిపిస్తారు. మ్యాచ్‌ల వారీగా ఈ రేసు చాలా ఉత్కంఠగా మారుతుంది. తన జట్టు టైటిల్ గెలవడమే కాకుండా ప్రతి బౌలర్ ఈ క్యాప్ గెలవాలని కలలు కంటాడు. ఈ సంవత్సరం లీగ్‌లో 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొన్నాయి. కాబట్టి పర్పుల్ క్యాప్ రేసు మరింత కష్టతరంగా ఉత్కంఠభరితంగా మారింది. అంతేకాకుండా ఈ రేసులో కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

రాహుల్ చాహర్ అవకాశాన్ని కోల్పోయాడు

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత పర్పుల్ క్యాప్ రేసు మారుతుందని భావించారు. పంజాబ్ స్పిన్ బౌలర్ రాహుల్ చాహర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. నాలుగు వికెట్లు తీసి చాహల్‌ను ఛేదించే అవకాశం వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

ఒడియన్ స్మిత్ నాలుగు వికెట్లతో వెనుకబడ్డాడు

చాహర్‌తో పాటు ముంబైకి చెందిన టిమల్ మిల్స్ కూడా చాహర్‌ను అధిగమించే అవకాశం దక్కించుకుంది. మిల్స్ మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. అయితే పంజాబ్‌పై అతను కూడా వికెట్ పడగొట్టలేకపోయాడు ముంబై తరఫున, బాసిల్ థంపి అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే అతను రేసులో చాలా వెనుకబడి ఉన్నాడు. బుమ్రా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు కానీ అతను కూడా ప్రస్తుతం చాలా వెనుకబడి ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఓడియన్ స్మిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇప్పుడు రేసులోకి వచ్చాడు.

Ambedkar Jayanti 2022: నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన చేసిన ఈ 7 పనులకి అందరూ సెల్యూట్‌ చేయాల్సిందే..!

Breakfast: బరువు తగ్గాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ తప్పులు చేయకండి..!

Relationship Tips: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. అలాంటి సమయంలోనే ఇలా చేయాలి..!