Breakfast: బరువు తగ్గాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ తప్పులు చేయకండి..!

Breakfast: బరువు తగ్గాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ తప్పులు చేయకండి..!
Breakfast

Breakfast:ఊబకాయం వల్ల చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతారు. దీంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ముందుగా అల్పాహారంతో ప్రారంభించాలి.

uppula Raju

|

Apr 12, 2022 | 1:38 PM

Breakfast:ఊబకాయం వల్ల చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతారు. దీంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ముందుగా అల్పాహారంతో ప్రారంభించాలి. ప్రజలు ఆలోచించకుండా ఉదయాన్నే పూరీలు, పరాటాలు, నామ్‌కీన్, బిస్కెట్లు వంటివి తీసుకుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. ఎందుకంటే మీరు ఏది తిన్నా అది మీ బరువుపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీరు బరువు తగ్గాలనుకుంటే డిన్నర్‌పై మాత్రమే కాకుండా, బ్రేక్‌ ఫాస్ట్‌పై కూడా దృష్టిసారించాలి. ప్రజలు ఉదయమే 5 లేదా 6 గంటలకి మేల్కొంటారు. కానీ 9 లేదా10 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటారు. ఇలా చేయకూడదు. నిద్రలేచిన తర్వాత మీరు 40 నుంచి 60 నిమిషాలలోపు బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి. మీరు దీనికి ముందు గింజలు లేదా పాలు తీసుకుంటే రెండు గంటల గ్యాప్ తీసుకోవచ్చు. కానీ నిద్ర లేచిన తర్వాత ఎక్కువసేపు ఏమీ తినకపోవడం శరీరానికి మంచిది కాదు.

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీరు మీ బ్రేక్‌ ఫాస్ట్‌ మిస్ చేస్తే అది మీ జీవక్రియ రేటును తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ని దాటవేయవద్దు. కొంతమంది ఉదయంపూట గుడ్లు మాత్రమే తింటారు. అందులో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. పచ్చసొనను వదిలివేస్తారు. ఇలా చేయడం సరికాదు. రోజు మొత్తంలో రెండు గుడ్లు తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే పండ్లను మాత్రమే తీసుకునే వ్యక్తులు విటమిన్లు, ఖనిజాలను మాత్రమే పొందుతారు. కానీ వారి కేలరీల సంఖ్య బాగా తగ్గుతుంది. వారు తగినంత ప్రోటీన్, పిండి పదార్థాలు, మంచి కొవ్వును పొందలేరు. అందువల్ల మీ రోజును చక్కగా ప్రారంభించడానికి మీ జీవక్రియ రేటు బాగుండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, పిండి పదార్థాలు, మంచి కొవ్వును చేర్చుకోవడం ముఖ్యం.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Relationship Tips: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. అలాంటి సమయంలోనే ఇలా చేయాలి..!

Knowledge: నగరాల పేర్లు మార్చడం ఎప్పుడు మొదలైంది.. దీనికి కారణాలు ఏంటి..?

Beauty Tips: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోయారా.. పెరుగుతో ఇలా ఉపశమనం పొందండి..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu