Knowledge: నగరాల పేర్లు మార్చడం ఎప్పుడు మొదలైంది.. దీనికి కారణాలు ఏంటి..?

Knowledge: నగరాల పేర్లు మార్చడం ఎప్పుడు మొదలైంది.. దీనికి కారణాలు ఏంటి..?
Change Cities Name

Knowledge: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నగరాల పేర్లు మార్చడంపై మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రభుత్వం తరపున దాదాపు 12 నగరాల పేర్లను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు

uppula Raju

|

Apr 12, 2022 | 1:04 PM

Knowledge: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నగరాల పేర్లు మార్చడంపై మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రభుత్వం తరపున దాదాపు 12 నగరాల పేర్లను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నగరాల్లో అలీఘర్, ఫరూఖాబాద్, సుల్తాన్‌పూర్, బదౌన్, ఫిరోజాబాద్ వంటి జిల్లాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన హయాంలో చాలా నగరాల పేర్లను మార్చారు. ఇప్పుడు త్వరలో మరో 12 నగరాల పేర్లు మార్చనున్నట్లు సమాచారం. ఇవేకాకుండా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌ల నుంచి నగరాలు, అవార్డుల పేర్లు మారుస్తున్న సంగతి తెలిసిందే. కానీ పేరు మార్చే ప్రక్రియ ఇప్పట్లో మొదలైంది కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానంతరం చాలా పేర్లు మారిపోయాయి. మొఘల్ కాలం నుంచి పేర్ల మార్పు నడుస్తుంది. వందల సంవత్సరాల క్రితం భారతదేశంలోని అనేక నగరాల పేర్లని మార్చారు. ఈ పరిస్థితిలో ఇండియాలో నగరాల పేర్ల మార్పు ఎంతకాలం నుంచి కొనసాగుతుందో తెలుసుకుందాం.

ఈ సంప్రదాయం మొఘల్ కాలం నుంచి ప్రారంభమైంది

భారతదేశంలో పేర్లు మార్చే ప్రక్రియ దాదాపు 700 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మొఘల్ పాలకులు ఒక ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అక్కడి నగరాలు, గ్రామాల పేర్లని మార్చేవారు. అలాగే చాలా మంది మధ్యయుగ పాలకులు నగరాలను స్థాపించారు. ఆ నగరాలకు వారి కుటుంబ సభ్యుల పేర్లు లేదా వారి పేరు పెట్టేవారు. ఉదాహరణకు ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో మూర్ఖుడిగా గుర్తింపు పొందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. అప్పుడు దేవగిరి పేరును దౌల్తాబాద్‌గా మార్చాడు. ఇప్పుడు ఈ నగరాన్ని దౌల్తాబాద్ అని పిలుస్తారు. ఉదాహరణకు 1303 సంవత్సరంలో చిత్తోర్‌గఢ్ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత అలాదుద్దీన్ ఖిల్జీ తన కుమారుడు ఖిజర్ ఖాన్ పేరు మీదుగా చిత్తోర్‌గఢ్‌ను ఖిజ్రాబాద్‌గా మార్చాడు.

అనేక నగరాల పేర్లను మార్చారు

ఉదాహరణకు ఆగ్రాకు అక్బర్ పేరు మీద అక్బరాబాద్ అని పేరు పెట్టారు. అంతకుముందు బనారస్‌కు కొన్ని రోజులకు మహమ్మదాబాద్ అని పేరు పెట్టారని చెబుతారు. ఈ జాబితాలో అనేక నగరాల పేర్లు ఉన్నాయి. అమెర్ పేరును మోమినాబాద్‌గా మార్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి పూర్వం కర్ణావతి అని పేరు ఉండేదని అంటారు. అంతే కాకుండా జామ్‌నగర్ పేరు ఇస్లాంనగర్‌గా, సతారా పేరు అజ్మతారాగా, మైసూర్ పేరు నజరాబాద్‌గా, మంగళూరు పేరు జలాలాబాద్‌గా, మడికేరి పేరు జఫ్రాబాద్‌గా ఉండేవి.

మొఘలుల పేర్లపై చాలా నగరాలు

భారతదేశంలోని 704 ప్రదేశాలకు 6 మొఘల్ పాలకుల పేర్లు పెట్టారు. వీరిలో బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఉన్నారు. ఇందులో దేశంలోని 251 గ్రామాలకు అక్బర్ పేరు పెట్టారు. తర్వాత ఔరంగజేబు177, జహంగీర్‌కు 141, షాజహాన్‌కు 63, బాబర్‌కు 61, హుమాయూన్‌ పేర్లని11 గ్రామాలకి పెట్టారు. ఇది కాకుండా దేశంలో దాదాపు 70 అక్బర్‌పూర్, 63 ఔరంగాబాద్ పేర్లపై ఉన్నాయి.

Beauty Tips: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోయారా.. పెరుగుతో ఇలా ఉపశమనం పొందండి..!

Viral Video: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎప్పుడూ ఇలా ట్రై చేయకండి..!

Cricket News: అద్భుతం.. వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు.. రెండు పరుగులు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu