Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: అద్భుతం.. వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు.. రెండు పరుగులు..!

Cricket News: ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు పడిపోయాయి.. విచిత్రం ఏంటంటే 2 పరుగులు కూడా వచ్చాయి. ఈ రికార్డ్‌ నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో

Cricket News: అద్భుతం.. వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు.. రెండు పరుగులు..!
6 Wickets On 6 Balls
Follow us
uppula Raju

|

Updated on: Apr 12, 2022 | 11:12 AM

Cricket News: ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు పడిపోయాయి.. విచిత్రం ఏంటంటే 2 పరుగులు కూడా వచ్చాయి. ఈ రికార్డ్‌ నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఇందులో మలేషియా క్లబ్ ఎలెవన్ బౌలర్ విరణ్‌దీప్ సింగ్ ఒక రనౌట్‌తో సహా మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యారు. రెండు ప‌రుగులు కూడా న‌మోద‌య్యాయి. ఈ పరుగులలో ఒకటి వైడ్ నుంచి రాగా మరొకటి రనౌట్‌ అయినప్పుడు వచ్చింది. దీంతో పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు తొమ్మిది వికెట్లకు 132 పరుగులు చేసింది. మలేషియా క్లబ్ ఎలెవన్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా వీరన్‌దీప్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడు తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో రెచ్చిపోయి 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం.

19వ ఓవర్ వరకు అంతా బాగానే ఉంది

తొలుత బ్యాటింగ్ చేసిన పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు 19వ ఓవర్ నాటికి అంతా బాగానే ఉంది. మయాంక్ గుప్తా (33), అభిషేక్ అగర్వాల్ (26), కెప్టెన్ మృగాంక్ పాఠక్ (39) మంచి ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్‌కు ముందు పాఠక్, ఇషాన్ పాండే (19) క్రీజులో ఉన్నారు. ఈ పరిస్థితిలో జట్టు 140 నుంచి 145 స్కోర్ చేయగలదని అనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్‌లో జట్టు పట్టాలు తప్పింది.

చివరి ఓవర్లో ఏం జరిగింది

తొలి బంతి వైడ్‌ వచ్చింది. దీంతో పుష్ స్పోర్ట్స్ ఢిల్లీకి ఒక పరుగు లభించింది. తర్వాత బంతికే మృగాంక్ పాఠక్ ఔటయ్యాడు. అతను 27 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేసిన తర్వాత అహ్మద్ ఫైజ్ చేతికి చిక్కాడు. రెండో బంతికి ఇషాన్ పాండే రనౌట్ అయ్యాడు. రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. తొలి పరుగు పూర్తి చేసిన అతను రెండో ప్రయత్నంలో క్రీజుకు దూరమయ్యాడు. దీంతో మరో పరుగు వచ్చింది. ఇతడు 15 బంతుల్లో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. మూడో బంతికి అనిందో నహరాయ్ బౌల్డ్ అయ్యాడు .నాలుగో బంతికి విశేష్ సరోహా బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతికి జతిన్ సింఘాల్ బౌలర్ విరందీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చాడు. అలా హ్యాట్రిక్‌ పూర్తయింది. ఆరో బంతికి విరందీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో స్పర్ష్‌ ఔటయ్యాడు. విరందీప్ సింగ్ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అద్భుతం చేశాడు. అలాగే ఓవర్‌లోని అన్ని బంతుల్లో వికెట్ పడినట్లయింది.

మలేషియా క్లబ్ 15 బంతుల్లో విజయం సాధించింది

133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా క్లబ్ ఎలెవన్ జట్టు సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. వీరందీప్ సింగ్ 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ అహ్మద్ ఫైజ్ (39), మహ్మద్ అమీర్ (25) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి 5 శాఖాహార ఆహారాలు.. ప్రతిరోజు తినాల్సిందే..!

Sunstroke: వడదెబ్బ లక్షణాలు.. తీసుకోవాల్సిన నివారణ పద్దతులు తెలుసుకోండి..!

Back Pain: నడుంనొప్పులకి శస్త్రచికిత్స తప్పనిసరి కాదు.. కొన్నిటిని ఇలా తగ్గించుకోవచ్చు..!