AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే ‘ఎక్స్-ఫ్యాక్టర్స్’..!

Gujarat Titans X Factors: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి రంగం సిద్ధమైంది. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి ఎలాగైనా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. మార్చి 31న పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరుతో గుజరాత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గత సీజన్‌లో ఎలిమినేటర్ వరకు వెళ్లి తృటిలో అవకాశం కోల్పోయిన శుభ్‌మన్ గిల్ సేన, ఈసారి కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.

IPL 2026: రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే 'ఎక్స్-ఫ్యాక్టర్స్'..!
Ipl 2026 Gujarat Titans
Venkata Chari
|

Updated on: Mar 20, 2026 | 7:50 AM

Share

Gujarat Titans X Factors: గత నాలుగు సీజన్లలో మూడుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన రికార్డు గుజరాత్ సొంతం. అయితే 2025లో మూడో స్థానంలో నిలిచినప్పటికీ, ఫైనల్ చేరలేకపోయింది. ఈసారి వేలంలో కొన్ని కీలక మార్పులు చేసిన ఈ జట్టు, విదేశీ ఆటగాళ్లపై భారీగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు ఈ సీజన్‌లో గుజరాత్ ఫేట్ మార్చే ‘ఎక్స్-ఫ్యాక్టర్’గా మారనున్నారు.

1. రషీద్ ఖాన్: రికార్డుల రారాజు..

టీ20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ పేరు వింటేనే బ్యాటర్లు వణికిపోతారు. ఇటీవలే టి20 ఫార్మాట్‌లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ చరిత్ర సృష్టించాడు. 6.58 ఎకానమీతో ప్రత్యర్థులను కట్టడి చేయడమే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. 147 స్ట్రైక్ రేట్‌తో దాదాపు 3000 పరుగులు చేసిన రషీద్, ఈ సీజన్‌లోనూ గుజరాత్‌కు వెన్నెముకగా నిలవనున్నాడు.

2. గ్లెన్ ఫిలిప్స్: ఆల్ రౌండ్ అస్త్రం..

న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఈసారి తుది జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో వచ్చే ఫిలిప్స్, కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లోనూ వికెట్లు తీయగలడు. 2026లో ఇప్పటివరకు టీ20ల్లో అతనికి 173.2 స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం. అంతేకాకుండా, ఫీల్డింగ్‌లో అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా ఇతని సొంతం.

3. జేసన్ హోల్డర్: విండీస్ వీరుడు..

వేలంలో 7 కోట్ల రూపాయలకు దక్కించుకున్న జేసన్ హోల్డర్, గుజరాత్ జట్టులో డెత్ ఓవర్ల సమస్యను తీర్చనున్నాడు. 2025 నుంచి ఇప్పటివరకు టీ20ల్లో అత్యధికంగా 111 వికెట్లు తీసిన బౌలర్ ఇతనే. డెత్ ఓవర్లలో స్లోయర్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో హోల్డర్ దిట్ట. ఫినిషర్‌గా కూడా 162 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టగలడు.

గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు (IPL 2026):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్ (వికెట్ కీపర్), టామ్ బాంటన్ (వికెట్ కీపర్), అర్షద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, కగిసో రబడ, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, అశోక్ శర్మ, పృథ్వీ రాజ్ యర్రా, ల్యూక్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us