AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ikigai To Kaizen: జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!

జపనీయులు తమ విశిష్టమైన సంస్కృతి, క్రమశిక్షణ, అంకితభావం, జీవనశైలితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. వారు సమయపాలనకు ప్రాణం ఇస్తారు. సాంకేతికతలో ప్రపంచాన్ని శాసిస్తున్నప్పటికీ, వారు తమ మూలాలను, సంప్రదాయాలను అస్సలు మర్చిపోరు. పెద్దవారి అనుభవం, జ్ఞానం, వారి సలహాలను ఎంతో గౌరవంగా జీవిస్తారు. జపనీయుల ఆరోగ్యం, దీర్ఘాయుషు గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూద్దాం:

Ikigai To Kaizen: జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
Japanese Lifestyle Secrets for a Longer, Happier LifeImage Credit source: Magnific
Janardhan Veluru
|

Updated on: Jun 12, 2026 | 5:20 PM

Share

ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల్లో జపాన్ ఒకటి. అక్కడి ప్రజలు కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. వారి క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఆలోచనా విధానం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. జపనీయుల కొన్ని ప్రత్యేక అలవాట్లను మనం కూడా అలవాటు చేసుకుంటే.. అవి మన జీవితాన్నీ మరింత సంతృప్తికరంగా మార్చే అవకాశముంది. జపనీయులు వందేళ్లు దీర్ఘాయుష్షుతో జీవించేందుకు దోహదపడుతున్న అద్భుతమైన జీవన సూత్రాలు ఇవే.

1. జీవితానికి ఒక బలమైన లక్ష్యం ఉండాలి (ఇకిగాయ్-Ikigai)

జపనీయులలో చాలా మంది ‘ఇకిగాయ్’ అనే జీవన విధానాన్ని అనుసరిస్తారు. అంటే.. జీవితం ఏదో నడిచిపోతోందని కాకుండా.. జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే బలమైన లక్ష్యంతో వారు జీవిస్తారు. ఉదయం నిద్రలేవగానే ఉత్సాహంగా ఆ రోజును ప్రారంభించేందుకు ఒక కారణం ఉండాలని వారు నమ్ముతారు. ఇష్టమైన పని, మన ప్రతిభ, సమాజానికి ఉపయోగపడే అంశాలు కలిసే చోటే నిజమైన ఆనందం దాగి ఉంటుందని జపనీయులు నమ్ముతారు.

2. ప్రస్తుత క్షణంలో జీవించడం

గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడంపై జపనీయులు ఎక్కువగా దృష్టి పెడతారు. కళాత్మక కార్యక్రమాలు, ధ్యానం వంటి అలవాట్లపై వారు దృష్టిసారిస్తారు. ఇవి మానసిక ప్రశాంతతను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

3. తక్కువ వస్తువులతో హాయిగా జీవించడం (Minimalism)

జపాన్‌లో మినిమలిజం ఒక జీవన విధానం. అవసరం లేని వస్తువులను ఇంట్లో నిల్వ చేయకుండా, అవసరమైన వాటినే ఉంచడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ వస్తువులు… ఎక్కువ సంతోషం అనే జీవన విధానానికి వారు ప్రాధాన్యత ఇస్తారు.

4. ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపు అలవాట్లు

మానసిక, శారీరక ఆరోగ్యానికి జపనీయులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తాజా కూరగాయలు, చేపలు, సీఫుడ్, తృణధాన్యాలు జపనీయుల ఆహారంలో ప్రధాన భాగంగా ఉంటాయి. ఎక్కువ నూనె, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ పోషకాహార అలవాట్లే వారి దీర్ఘాయువు, ఆరోగ్యం వెనకున్న రహస్యం.

5. ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించుకోవడం (Hygge)

బిజీ జీవితంలో కూడా ఇంటిని ప్రశాంతతకు నిలయంగా మార్చుకోవడం జపనీయులకున్న ఓ గొప్ప అలవాటు. సరైన వెలుతురు, శుభ్రమైన పరిసరాలు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు వారు ఎక్కువగా ఇష్టపడుతారు. దీని ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు.

6. ప్రతిరోజూ కొంచెం మెరుగుపడటం (Kaizen)

ఒక్కసారిగా పెద్ద మార్పులు చేయడం కంటే ప్రతిరోజూ చిన్న చిన్న మెరుగుదలలు చేసుకుంటూ ముందుకు సాగాలని “కైజెన్” తత్వం చెబుతుంది. ఈ అలవాటు జీవితంలో స్థిరమైన విజయాలకు దారి తీస్తుంది.

7. ప్రకృతికి దగ్గరగా ఉండటం

చెట్లు, పూలు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జపనీయులు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. అడవుల్లో నడకలు, చెర్రీ బ్లాసమ్ పూల అందాలను వీక్షించడం వంటి కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.

8. అతిథులను హృదయపూర్వకంగా ఆహ్వానించడం (Omotenashi)

“ఒమొటెనాషి” అనే భావన ప్రకారం అతిథులను ఎలాంటి స్వార్థం లేకుండా గౌరవంగా చూసుకోవడం జపాన్ సంస్కృతిలో భాగం. ఇది మనుషుల మధ్య బలమైన బంధాలను ఏర్పరుస్తుంది.

9. క్రమశిక్షణ, సమయపాలన

సమయానికి విలువ ఇవ్వడం, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించడం, కష్టపడి పనిచేయడం జపనీయుల ప్రధాన లక్షణాలు. అందుకే ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది.

10. కష్టాల నుంచి తిరిగి నిలబడే శక్తి

భూకంపాలు, సునామీలు వంటి ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ప్రజలు ధైర్యం కోల్పోలేదు. పట్టుదలతో పరిస్థితులకు అనుగుణంగా మారి.. ప్రతిసారి మరింత బలంగా తిరిగి నిలబడటం వారి ప్రత్యేకత. జపనీయుల పట్టుదల అందరికీ ఆదర్శం.

11. పెద్దలకు గౌరవం ఇవ్వడం

జపాన్‌ సంస్కృతిలో పెద్దలను గౌరవించడానికి అత్యున్నత స్థానం ఉంటుంది. వయసుతో వారు పొందిన అనుభవం, జ్ఞానాన్ని ఎంతో గౌరవిస్తారు. వారిచ్చే సలహాలను అత్యంత విలువైనవిగా భావిస్తారు. దీనివల్ల వారి కుటుంబ బంధాలు తరతరాలుగా బలంగా ఉంటాయి.

12. ప్రతి పనిలో నాణ్యతకు ప్రాధాన్యత

చిన్న పనైనా, పెద్ద పనైనా అత్యంత శ్రద్ధతో చేయడం జపనీయుల లక్షణం. అందుకే వారి ప్రాడక్టులు, సేవలు ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు మారుపేరుగా నిలుస్తాయి. ఏ పని చేసినా అంకితభావంతో, నాణ్యతతో చేయాలన్న వారి లక్షణం మనం కూడా అలవాటు చేసుకోదగినది.

13. లోపాల్లోనూ అందాన్ని చూడడం (Wabi-Sabi)

‘వాబి-సాబి’ అనేది ఒక అద్భుతమైన జపనీస్ జీవన తత్వం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ఏదీ పర్‌ఫెక్ట్ కాదు. జీవితంలో లోపాలను, కాలానుగుణంగా వచ్చే మార్పులను కూడా జీవితంలో భాగంగా స్వీకరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమశిక్షణ, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత వంటి విలువలను జపనీయులు తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు. వారి ఈ జీవన సూత్రాల్లో కొన్నింటినైనా మనం అలవర్చుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం, సంతృప్తి కలుగుతుంది. చిన్న చిన్న మార్పులతో ప్రారంభిస్తే, పెద్ద విజయాలు సాధించడం కష్టమేమీ కాదు.

Also Read: కొత్త జీవితం కావాలా..? పాము నేర్పించే గొప్ప జీవిత పాఠం నేర్చుకోండి..

Follow Us
కనిపించినంత సున్నితంగా ఉండరు మావ.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
కనిపించినంత సున్నితంగా ఉండరు మావ.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలిపోకూడదంటే.. ఈ యువతి కథ చదవాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలిపోకూడదంటే.. ఈ యువతి కథ చదవాల్సిందే!
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
అతడి దెబ్బకు సచిన్, కోహ్లీల రికార్డులన్నీ మటాష్
అతడి దెబ్బకు సచిన్, కోహ్లీల రికార్డులన్నీ మటాష్
ఒక్కసారిగా మీ అదృష్టాన్ని మార్చే తమలపాకులు.. ఇలా చేస్తే పట్టిన..
ఒక్కసారిగా మీ అదృష్టాన్ని మార్చే తమలపాకులు.. ఇలా చేస్తే పట్టిన..