AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త జీవితం కావాలా..? పాము నేర్పించే గొప్ప జీవిత పాఠం నేర్చుకోండి..

Life Lessions From Snake: ప్రకృతి నుంచి నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే అలవాటు మనకుంటే.. పాము జీవన విధానం కూడా మనకు విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది. పాము తన పాత కుబుసాన్ని విడిచిపెట్టినట్లే, మనిషి కూడా గతంలోని బాధలు, అపజయాలు , చేదు జ్ఞాపకాలను వదిలేస్తేనే కొత్త జీవితానికి అవకాశం ఉంటుంది. ఏకాంతాన్ని స్వీకరించడం, నిశ్శబ్దంలో ఉండడం, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం వంటి గుణాలు మనిషి జీవితాన్ని మరింత ప్రశాంతంగా, విజయవంతంగా మారుస్తాయి.

కొత్త జీవితం కావాలా..? పాము నేర్పించే గొప్ప జీవిత పాఠం నేర్చుకోండి..
Life Lessions From SnakeImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jun 05, 2026 | 7:32 PM

Share

నిశితంగా పరిశీలిస్తే.. ప్రకృతిలో ప్రతి జీవి మనిషికి ఏదో ఒక జీవిత సత్యాన్ని బోధిస్తుంది. చివరికి పాము దగ్గరి నుంచి కూడా మనం నేర్చుకోదగిన జీవిత పాఠాలు కూడా ఉన్నాయంటే కాస్త ఆశ్చర్యం కలిగించినా.. ఇది ముమ్మాటికీ నిజం. సాధారణంగా పాము గురించి అనేక అపోహలు ఉన్నాయి. దాన్ని మనం చెడుగానే చూస్తాం.  అయితే దాని జీవన విధానం మనిషికి ఆత్మవికాసం, మనశ్శాంతి, జీవిత మార్పుల గురించి గొప్ప పాఠాలను అందిస్తుంది.

1. కుబుసం విడవడం – గతాన్ని వదిలేయడం

  • పాము నిర్దిష్ట కాలానికి తన కుబుసం విడిచిపెడుతుంది. అది గతాన్ని పట్టుకుని ఊగిసలాడదు. కొత్త జీవితానికి మారడానికి పాతదాన్ని వదిలేయడం దాని సహజ స్వభావం. పాత కుబుసం పోతేనే కొత్తది వస్తుందని దానికి తెలుసు.
  • అయితే మనిషి మాత్రం గతంలోని బాధలు, అపజయాలు, చేదు జ్ఞాపకాలను మోస్తూ ముందుకు సాగలేకపోతాడు. గతాన్ని వదిలితేనే కొత్త అవకాశాలు మన జీవితంలోకి వస్తాయి. గతాన్ని పట్టుకుని ఏడుస్తుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము.

2. ఏకాంతం, నిశ్శబ్ద జీవనం

  • పాము అనవసరంగా శబ్దం చేయదు. తన దారిలో తాను నిశ్శబ్దంగా సాగుతుంది. అది ఒంటరితనాన్ని కూడా భయపడదు.
  • పాములానే మనిషి కూడా కొంత సమయం ఏకాంతం, నిశ్శబ్దంలో గడిపితే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది.

3. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం

  • పాము ఎప్పుడూ ఎదుటి వారిపై దాడి చేయదు. తనకు ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే తనను తాను రక్షించుకుంటుంది.
  • మనిషి మాత్రం చిన్న విషయాలకే ఇతరులపై కోపం, ఆవేశం చూపిస్తాడు. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం నేర్చుకోవాలి.

పాము జీవితం మనకు ఈ జీవిత పాఠాలను నేర్పిస్తుంది. గతాన్ని వదిలేసి కొత్తదనానికి స్వాగతం చెప్పడం, నిశ్శబ్దాన్ని అంగీకరించడం, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం. ఈ గుణాలను మనిషి కూడా అలవాటు చేసుకుంటే అతని జీవితం మరింత శాంతియుతంగా, విజయవంతంగా మారిపోవడం ఖాయం.

Follow Us