AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Juice: డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగితే..

వర్షాకాలంలో మనకు విరివిగా దొరికే పలాల్లో జామూన్ కూడా ఒకటి. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే వీటిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారనే విషయం మీకు తెలుసా? అవును కాకరకాయ, జామూన్‌ కలయికతో తయారుచేసే జ్యూస్, డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంతో అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇది డయాబెటీస్‌ను నియంత్రించడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Diabetes Juice: డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగితే..
Jamun For Diabetes
Anand T
|

Updated on: Jun 12, 2026 | 5:16 PM

Share

జామూన్, కాకరకాయ ఇవి రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ రెండింటిని కలిపి తయారు చేసే జ్యూస్‌ను ఆయుర్వేదంలో డయాబెటీస్‌ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగిస్తారట. ఇవి రెండూ రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయట. నేరేడు పండ్లలో జాంబోలిన్ ,జాంబోసిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి పిండి పదార్థాలు చక్కెరగా మారే ప్రక్రియను స్లో చేయడకే కాకుండా, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయిట.

2010లో ‘ఏషియన్ పసిఫిక్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ బయోమెడిసిన్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, నేరేడు గింజలు డయాబెటిస్ ఉన్న ఎలుకలలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించాయని తేలిందట. అలాగే ఈ పండులో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది టైప్-2 డయాబెటిస్ నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుందట.

రక్తంలో చక్కెర స్థాయిలను కాకరకాయ ఎలా తగ్గిస్తుంది

కాకరకాయలో హైపోగ్లైసిమిక్, చారంటిన్ , విసిన్ , పాలిపెప్టైడ్-పి వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ లాగే పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. 2011లో జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, టైప్-2 డయాబెటిస్ రోగులలో పరగడుపున ఉండే బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించడంలో కాకరకాయ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారించబడింది. కాకరకాయ రసం ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి, ప్రేగులలో గ్లూకోజ్ శోషణను తగ్గించడానికి సహాయపడుతుంది.

జామూన్- కాకరకాయ జ్యూస్ డయాబెటీస్‌ను తగ్గిస్తుందా?

జామూన్-కాకరకాయ జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గణనీయంగా సహాయపడినప్పటికీ, ఇది డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేస్తుందనడానికి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. డయాబెటిస్ రివర్సల్ అనేది కేవలం ఒక జ్యూస్ వల్ల సాధ్యం కాదు. దీనికి ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణ, అవసరమైతే వైద్యుల మందులతో కూడిన సమగ్ర జీవనశైలి మార్పులు కూడా అవసరం. ఈ జ్యూస్ ఆ జీవనశైలికి ఒక అదనపు మద్దతుగా పనిచేస్తుందే తప్ప, మందులకు ప్రత్యామ్నాయం కాదు.

వైద్యపరమైన జాగ్రత్తలు

ప్రస్తుతం దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఇది ఒక మంచి అనుబంధ చికిత్సగా పనిచేస్తుంది. 2018లో ‘ఆయుర్వేద జర్నల్ ఆఫ్ హెల్త్’లో వచ్చిన ఒక చిన్న అధ్యయనం ప్రకారం, 3 నెలల పాటు ప్రతిరోజూ జామూన్-కాకరకాయ జ్యూస్ తాగిన వారిలో బ్లడ్ గ్లూకోజ్, HbA1c స్థాయిలు తగ్గినట్లు తేలింది. అయితే రోగులు దీనిని పరిమితంగానే తీసుకోవాలి. డయాబెటిస్ మందులు వాడుతూ, ఈ జ్యూస్‌ను అతిగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే అవకాశం ఉంది.

ఈ జ్యూస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి?

జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు : 2 కాకరకాయలు, 10-12 తాజా నేరేడు పండ్లు లేదా 2 టేబుల్ స్పూన్ల నేరేడు గుజ్జు, 1 నుండి 1½ కప్పుల నీరు, చిటికెడు నల్ల ఉప్పు , కొన్ని నిమ్మరసం చుక్కలు.

తయారీ విధానం:

  • కాకరకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసి, లోపలి గింజలను తీసేయాలి. చేదు తగ్గడానికి ఈ ముక్కలను 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి.
  • ఇప్పుడు నేరేడు పండ్లను కడిగి, వాటి గింజలను వేరు చేయాలి.
  • ఇప్పుడు కాకరకాయ ముక్కలు, నేరేడు పండ్ల గుజ్జును మిక్సీలో వేసి, 1 నుండి 1½ కప్పుల నీరు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక వడపోత జల్లెడ సహాయంతో బాగా వడకట్టాలి.
  • రుచి కోసం ఇందులో చిటికెడు నల్ల ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి
  • ఈ జ్యూస్‌ను ఉదయం పూట పరగడుపున తాజాగా ఉన్నప్పుడే తాగాలి. మిగిలిన జ్యూస్‌ను ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటల లోపు వాడుకోవచ్చు.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించండి. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?