AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diesel: డీజిల్ అమ్మకాలపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. రోజువారీ పరిమితి విధింపు.. అన్ని లీటర్ల వరకు మాత్రమే..

కేంద్ర ప్రభుత్వం డీజిల్ విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ విక్రయాలపై పరిమితులు విధించింది. అంటే ఒక వ్యక్తి రోజుకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి వరకు మాత్రమే డీజిల్ కొనుగోలు చేసే అవకాశముంటుంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతల క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Diesel: డీజిల్ అమ్మకాలపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. రోజువారీ పరిమితి విధింపు.. అన్ని లీటర్ల వరకు మాత్రమే..
Petrol And Disel
Venkatrao Lella
|

Updated on: Jun 12, 2026 | 5:08 PM

Share

కేంద్ర ప్రభుత్వం డీజిల్ కొనుగోళ్లపై సడెన్ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధించింది. ఇక నుంచి ఎంత కావాలంటే అంత డీజిల్ నింపుకోవడానికి వీలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి వరకు మాత్రమే డీజిల్ కొనుగోలు చేసే అవకాశముంటుంది. ఈ మేరకు అన్నీ చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ “మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా సరఫరాకు తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026ను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం పలు కఠిన నిబంధనలు విధించింది.

200 లీటర్ల వరకు మాత్రమే..

డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం రోజువారి పరిమితి విధించింది. ఒక వ్యక్తి ఏ వాహనానికైనా ఒక్కరోజులో గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసేందుకు సాధ్య పడదు. అంతేకాకకుండా కొనుగోలు చేసిన డీజిల్‌ను వినియోగదారుడు తిరిగి విక్రయించడంపై నిషేధం అమల్లోకి తెచ్చింది. డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకోవడం, నిల్వల లభ్యతను పెంచడం కోసం కేంద్రం ఈ రూల్స్ తీసుకొచ్చింది. 90 రోజుల వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం, 1955, ఇతర వర్తించే చట్టాల ప్రకారం జరిమానా విధించడం, ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు డీజిల్ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలు ఇవే..

-పెట్రోల్ బంకుల్లో సిబ్బంది డీజిల్‌ను వాహన ట్యాంకులలో లేదా PESO ఆమోదించిన కంటైనర్లలో మాత్రమే అందించాలి

– ప్రతి కస్టమర్ లేదా వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ విక్రయించాలి

–రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి అమ్మకూడానికి వీల్లేదు

-పారిశ్రామిక, ప్రత్యక్ష, సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయకూడదు

-పెద్ద వాణిజ్య వినియోగదారులు కన్స్యూమర్ పంపుల ద్వారానే డీజిల్ పొందాలి

పెద్ద వ్యాపారులు అక్కడే..

-చాలామంది పెద్ద వ్యాపారులు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల సామాన్య వినియోగదారుడికి లభ్యత తగ్గుతుంది. టోకు మార్కెట్ కంటే రిటైల్ అవుట్ లెట్లలో పెట్రోల్ ,డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో రవాణా సంస్థలు, ఇతర పెద్ద వ్యాపార వినియోగదారులు పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో  పెద్ద వ్యాపారులు రిటైల్ అవుట్‌లెట్లలో డీజిల్ కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది.

Follow Us
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం..
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం