AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund: రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. 10 ఏళ్లలో ఇన్వెస్టర్లను ధనవంతులను చేసిన మ్యూచువల్ ఫండ్!

Mutual Fund: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించడం సంపదను కూడబెట్టడానికి చాలా ప్రభావవంతమైన మార్గంగా నిరూపితమవుతోంది. నెలవారీగా ఇన్వెస్ట్‌ చేస్తుంటే మెచ్యూరిటీ సమయానికి మీరు ధననవంతులు కావచ్చు. నెలకు 10 వేల రూపాయల చొప్పున..

Mutual Fund: రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. 10 ఏళ్లలో ఇన్వెస్టర్లను ధనవంతులను చేసిన మ్యూచువల్ ఫండ్!
Sip
Subhash Goud
|

Updated on: Jul 26, 2026 | 7:45 PM

Share

Mutual Fund: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతటి సంపద సృష్టించవచ్చో నిరూపించింది ఒక హైబ్రిడ్ ఫండ్. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించి వారి భాగస్వామ్యాన్ని మరింత బలపరిచింది. వేల్యూ రీసెర్చ్ (Value Research) గణాంకాల ప్రకారం, ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్’ అనే పథకంలో 10 ఏళ్ల క్రితం నెల నెలా రూ.10,000 చొప్పున ఎస్‌ఐపీ ప్రారంభించిన ఇన్వెస్టర్ల నిధి ఇప్పుడు రూ.28 లక్షల మార్కును దాటింది.

ఇది కూడా చదవండి: RBI: త్వరలో ఆర్‌బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్‌కు క్లారిటీ..!

10 ఏళ్ల SIP రాబడి లెక్కలు ఇవే:

వేల్యూ రీసెర్చ్ ఎస్‌ఐపీ క్యాలిక్యులేటర్ ప్రకారం ఈ ఫండ్ పనితీరు ఇలా ఉంది:

ఇవి కూడా చదవండి
  • నెలకు చేసే SIP మొత్తం: రూ.10,000
  • మొత్తం ఇన్వెస్ట్ చేసిన సొమ్ము (10 ఏళ్లలో): రూ.12,000,000 (రూ.12 లక్షలు)
  • ప్రస్తుత ఫండ్ వాల్యూ: రూ.28,89,000 (రూ.28.89 లక్షలు)
  • వార్షిక రాబడి (XIRR): 16.76%

ఈ రకమైన హైబ్రిడ్ పథకం జూలై 2016 నుండి మార్చి 2026 మధ్య కాలంలో 13.2% CAGR నమోదు చేసింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 TRI 15.4% CAGR, నిఫ్టీ 100 TRI 11.7% CAGR రాబడిని ఇచ్చాయి.

ఈ ఫండ్ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది?

‘బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్’ అనేది ఒక ఓపెన్-ఎండెడ్ హైబ్రిడ్ స్కీమ్. స్టాక్ మార్కెట్ లాభాలను అందుకోవడంతో పాటు డెట్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందించడం దీని ప్రధాన లక్ష్యం.

  • ఈక్విటీ (అలొకేషన్ 65% – 80%): ఫండ్ తన వద్ద ఉన్న మొత్తం నిధులలో అధిక భాగాన్ని వేగంగా పెరిగే మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడుతుంది.
  • డెట్ (అలొకేషన్ 20% – 35%): మిగిలిన భాగాన్ని సురక్షితమైన డెట్ బాండ్లు, మనీ మార్కెట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో రిస్క్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, డెట్ కలయిక (Hybrid Model) ఉన్న ఫండ్స్ సుదీర్ఘ కాలంలో మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకుని క్రమబద్ధమైన ఎస్‌ఐపీ ద్వారా భారీ సంపదను సృష్టించగలవని ఈ ఫండ్ నిరూపించింది.

ఇది కూడా చదవండి: Google Account Recovery: సెల్ఫీ వీడియోతోనే గూగుల్ అకౌంట్ రికవరీ.. పాస్‌వర్డ్ మరిచిపోయినా నో టెన్షన్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us