AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZIM vs IND 3rd T20I Result: శ్రేయాస్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్..!

Zimbabwe vs India, 3rd T20I: హరారే వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది. జింబాబ్వేను 35 పరుగుల తేడాతో చిత్తు చేసి 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనతో టీమిండియా ఈ పర్యటనను క్లీన్ స్వీప్‌తో ఘనంగా ముగించింది.

ZIM vs IND 3rd T20I Result: శ్రేయాస్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్..!
Ind Vs Zim T20i Series
Venkata Chari
|

Updated on: Jul 26, 2026 | 8:15 PM

Share

Zimbabwe vs India, 3rd T20I: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 81 పరుగులు చేసి జట్టుకు కొండంత కొండంత స్కోరు అందించాడు. ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (27) తమ వంతు సహకారం అందించగా, ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్ (25) వేగంగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.

తడబడిన జింబాబ్వే ఛేజింగ్..

193 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు తొలి బంతికే గట్టి షాక్ తగిలింది. భారత పేసర్ మయాంక్ యాదవ్ మొదటి బంతికే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్‌ను అవుట్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. జింబాబ్వే బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయారు.

బౌలర్ల ఉమ్మడి ఆధిపత్యం..

భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ జింబాబ్వేను ఎక్కడా కోలుకోనివ్వలేదు. మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వరుస వికెట్లతో విరుచుకుపడ్డారు. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్, వెస్లీ మధ్వేరే కాసేపు పోరాడినా జట్టును విజయం వైపు నడిపించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది.

సిరీస్ సొంతం చేసుకున్న కుర్రాళ్లు

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. యంగ్ ఇండియన్ టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య జట్టును పూర్తిగా ఆధిపత్యంలోకి తీసుకుంది. ముఖ్యంగా ఐపీఎల్ స్టార్స్ తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికపై నిరూపించుకోవడంతో భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందనే నమ్మకం కలిగింది.

జింబాబ్వే గడ్డపై యువ భారత్ అదరగొట్టి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. యంగ్ పవర్ మెరుపులతో రాబోయే సిరీస్‌లలోనూ టీమిండియా ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!