Ravichandran Ashwin: అందుకే అలాంటి నిర్ణయం.. రిటైర్డ్‌ ఔట్‌పై క్లారిటీ ఇచ్చిన అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Ravichandran Ashwin: అందుకే అలాంటి నిర్ణయం.. రిటైర్డ్‌ ఔట్‌పై క్లారిటీ ఇచ్చిన అశ్విన్‌.. ఏమన్నాడంటే?
Ravichandran Ashwin Retired Out Ipl 2022

R Ashwin Retired Out: అయితే, అశ్విన్ నిర్ణయం గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ విషయం తనకు తెలియదని ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత షిమ్రాన్ హెట్మెయర్ చెప్పాడు. అశ్విన్ మైదానం బయటికి పరుగెత్తడం చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు.

Venkata Chari

|

Apr 12, 2022 | 10:53 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో రిటైర్డ్‌(R Ashwin Retired Out) ఔట్ అయన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రాజస్థాన్ రాయల్స్(RR), లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఇలా పెవిలియన్ చేరాడు. అశ్విన్ 23 బంతుల్లో 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆపై అకస్మాత్తుగా మైదానం వీడి రియాన్ పరాగ్‌కు మైదానంలోకి వచ్చే అవకాశం ఇచ్చాడు. షిమ్రాన్ హెట్మెయర్‌కు మద్దతుగా పరాగ్ క్రీజులోకి వచ్చాడు. హెట్మెయర్ 36 బంతుల్లో 59 పరుగులు చేయడంతో, రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి, విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, అశ్విన్ నిర్ణయం గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ విషయం తనకు తెలియదని ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత షిమ్రాన్ హెట్మెయర్ చెప్పాడు. అశ్విన్ మైదానం బయటికి పరుగెత్తడం చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు.

అయితే ఇదే విషయంపై అశ్విన్‌ క్లారిటీ ఇచ్చాడు. నేను రిటైర్డ్‌ ఔట్‌ కావడం పట్ల బయట తీవ్రమైన చర్చలు నడిచాయి. అయితే, ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదంటూ చెప్పుకొచ్చాడు.’ రిటైర్డ్ ఔట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకుంది. గౌతమ్‌ ఔటయ్యాక నేను క్రీజులోకి వచ్చాను. చివర్లో భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించా. అది కుదరలేదు. ఇలాంటి సమయంలో రియాన్ పరాగ్‌ క్రీజులోకి వచ్చి, భారీ సిక్సర్లు కొడితే బాగుంటుందని ఆలోచించాను. అలాంటి పరిస్థితుల్లో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే, ఇవి కొన్నికొన్ని సార్లు ఫలితాలనిస్తే, మరికొన్నిసార్లు అంతగా వర్క్ చేయవు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

ఇదే విషయంపై రాజస్లాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర కూడా మాట్లాడాడు. ‘ అశ్విన్ మ్యాచ్‌ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్నాడు. అందుకే రిటైర్డ్‌ ఔట్‌‌గా పెవిలియన్ చేరుకున్నాడు. మ్యాచ్ పరిస్థితిని చూసి, ఇలా ఔటవుతానని అశ్విన్ తనకు తానే కోరాడు. రిటైర్డ్‌ ఔట్‌ గురించి అంతకుముందే మాట్లాడుకున్నాం’’ అంటూ ఆయన అసలు విషయాన్ని తెలిపాడు.

నిబంధనల ప్రకారం రిటైర్డ్ ఔట్ అవ్వొచ్చా-

‘అంపైర్, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి లేకుండా బ్యాట్స్‌మన్ తన ఇన్నింగ్స్‌ను మధ్యలోనే వదిలివేసినప్పుడు రిటైర్డ్ అవుతాడు. కానీ, అతను అంపైర్‌కు లేదా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కి చెప్పకుండా వెళ్తే, అప్పుడు అతన్ని ‘రిటైర్డ్ ఔట్’ అని పిలుస్తారు. రిటైర్డ్ ఔట్ అయిన తర్వాత, బ్యాట్స్‌మన్ తిరిగి బ్యాటింగ్‌కు రాలేడు. అదే సమయంలో రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత జట్టుకు అవసరమైతే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.

అంతర్జాతీయ క్రికెట్‌లోనూ..

ఐపీఎల్‌లో ఇది మొదటిసారి జరిగి ఉండవచ్చు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది జరిగింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భూటాన్‌కు చెందిన సోనమ్ తోగ్బే మాల్దీవులపై 19వ ఓవర్‌లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

నిబంధనలను సద్వినియోగం చేసుకోవడంలో అశ్విన్ అద్భుతంగా ఉన్నాడు. అతను మన్‌కడింగ్‌ను ఉపయోగించినప్పుడు చాలా వివాదం జరిగింది. అశ్విన్ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

Also Read: IPL 2022: ఓడినా ఆ విషయంలో చెన్నైదే అగ్రస్థానం.. మరోసారి హిస్టరీ రిపీట్ కానుందా..

IPL 2022: ఇదేందయ్యా..భువీ.. తొలి ఓవర్‌లోనే ఇంత ఘోరమా.. 10 ఏళ్లనాటి జడేజా చెత్త రికార్డ్ బ్రేక్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu