AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఇదేందయ్యా..భువీ.. తొలి ఓవర్‌లోనే ఇంత ఘోరమా.. 10 ఏళ్లనాటి జడేజా చెత్త రికార్డ్ బ్రేక్..

ఏప్రిల్ 11వ తేదీ సోమవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేసింది. ఎప్పటిలాగే, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టు తరపున బౌలింగ్ ప్రారంభించాడు.

IPL 2022: ఇదేందయ్యా..భువీ.. తొలి ఓవర్‌లోనే ఇంత ఘోరమా.. 10 ఏళ్లనాటి జడేజా చెత్త రికార్డ్ బ్రేక్..
Ipl 2022 Bhuvneshwar Kumar
Venkata Chari
|

Updated on: Apr 12, 2022 | 9:02 AM

Share

టీ20 క్రికెట్‌లో బౌలర్లు కూడా ఎక్కువగా రాణిస్తుంటారు. ఫాస్ట్‌ బౌలర్‌ అయినా, స్పిన్నర్‌ అయినా.. బ్యాట్స్‌మెన్స్ ఇబ్బంది పడడం చూడొచ్చు. బౌలర్ ఎంత అనుభవజ్ఞుడైనా లేదా కొత్త బౌలర్ అయినా, ఈ ఫార్మాట్‌లో ఉపశమనం పొందే అవకాశం చాలా తక్కువ. నైపుణ్యం ఉన్న బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) ఒకరు. అనుభవజ్ఞుడైన భారత పేసర్ చాలా కాలంగా T20 క్రికెట్ (అంతర్జాతీయ, IPL)లో తన ఆర్థికంగా, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అయితే కొన్నిసార్లు వేసుకున్న ప్రణాళికలు దారితప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. ఐపీఎల్ 2022 (IPL 2022) లో భువనేశ్వర్‌కు అలాంటిదే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (SRH vs GT)మొదటి ఓవర్‌లో, భువనేశ్వర్ ఘెరమైన తప్పిదాలు చేశాడు. చాలా పేలవమైన రికార్డు నమోదైంది.

ఏప్రిల్ 11వ తేదీ సోమవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేసింది. ఎప్పటిలాగే, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టు తరపున బౌలింగ్ ప్రారంభించాడు. భువనేశ్వర్ ఇటీవలి కాలంలో తన పాత ఊపును పుంజుకుని గత రెండేళ్ల కంటే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, ఈ తొలి ఓవర్‌లో మాత్రం భారీగా పరుగులు ఇచ్చాడు.

తొలి ఓవర్‌లోనే లైన్‌ తప్పిన భువీ..

భువనేశ్వర్‌ వేసిన తొలి బంతికే గుజరాత్‌ ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి బౌండరీ వద్దకు వెళ్లింది. ఆ తర్వాతి బంతి లెగ్ స్టంప్ వెలుపల ఉంది. అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ బంతిని కీపర్ కూడా ఆపలేకపోయాడు. అంటే వైడ్‌తో మరో 4 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్‌లోని మూడో బంతి ఆఫ్-స్టంప్ వెలుపల పడింది. దానిపై 1 రన్ వైడ్ దొరికింది. భువీ ఐదో బంతికి మళ్లీ అదే పొరపాటు చేసి వైడ్‌తో 4 అదనపు పరుగులు ఇచ్చాడు.

బద్దలైన జడేజా పదేళ్ల రికార్డు..

ఈ విధంగా, గుజరాత్ మొదటి ఓవర్‌లోనే మొత్తం 17 పరుగులు సాధించగా, అందులో 11 పరుగులు వైడ్ రూపంలో వచ్చాయి. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కెరీర్‌లో పేలవమైన రికార్డు వచ్చి చేరింది. భువనేశ్వర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో వైడ్‌పై అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా నిలిచాడు. ఈ పేలవమైన రికార్డు విషయంలో రవీంద్ర జడేజా 10 ఏళ్ల రికార్డును భువీ బద్దలు కొట్టాడు. 2012లో రాజస్థాన్‌పై జడేజా ఒక ఓవర్‌లో వైడ్‌లో 10 పరుగులు ఇచ్చాడు. జడేజా రికార్డును ప్రస్తుత సీజన్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన మహ్మద్ సిరాజ్ సమం చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై వైడ్‌లో 10 పరుగులు ఇచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

Also Read: IPL 2022: హార్దిక్ దెబ్బకు యువరాజ్, పంత్ రికార్డులు మటాష్.. ఆ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్.. అదేంటంటే?

Watch Video: వారెవ్వా త్రిపాఠి.. దిగ్గజాలకు షాకిస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. చూస్తే బిత్తరపోతారంతే.!