Watch Video: వారెవ్వా త్రిపాఠి.. దిగ్గజాలకు షాకిస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. చూస్తే బిత్తరపోతారంతే.!

Watch Video: వారెవ్వా త్రిపాఠి.. దిగ్గజాలకు షాకిస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. చూస్తే బిత్తరపోతారంతే.!
Ipl 2022 Srh Vs Gt Rahul Tripathi’s Catch

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (SRH vs GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, SRH ఆటగాడు రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi’s Catch) అద్భుత ఫీల్డింగ్‌తో గిల్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Venkata Chari

|

Apr 12, 2022 | 7:09 AM

ఐపీఎల్ 2022(IPL 2022)లో శుభ్‌మన్ గిల్‌(Shubman Gill) అద్భుతంగా రాణిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌ తరపున ఓపెనింగ్ పాత్ర పోషిస్తున్న భారత యువ బ్యాట్స్‌మెన్, సీజన్‌లోని మొదటి 3 మ్యాచ్‌లలో రెండు భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీజన్‌లోని నాల్గవ మ్యాచ్‌లో కూడా శుభ్మన్ నుంచి ఇదే విధమైన ఇన్నింగ్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. అతనితోపాటు గత సీజన్‌లో ఒకే జట్టులో ఆడిన ఆటగాడి దెబ్బకు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (SRH vs GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, SRH ఆటగాడు రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi’s Catch) అద్భుత ఫీల్డింగ్‌తో గిల్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

ఏప్రిల్ 11, సోమవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అంటే గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, జట్టు మంచి ప్రారంభాన్ని ఆశించింది. మొదటి ఓవర్‌లోనే, అనుభవజ్ఞుడైన బౌలర్ భువనేశ్వర్ లెగ్ స్టంప్ వెలుపల వైడ్‌పై 2 ఫోర్లు అందించగా, మాథ్యూ వేడ్ బ్యాట్ నుంచి ఒక ఫోర్ వచ్చింది. ఈ విధంగా తొలి ఓవర్‌లోనే 17 పరుగులు వచ్చాయి.

త్రిపాఠి అద్భుత క్యాచ్..

రెండో ఓవర్‌లో మార్కో యాన్సన్‌పై శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫోర్ కొట్టాడు. ఈ ఫోర్ చూస్తుంటే గిల్ ఈరోజు మళ్లీ బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడబోతున్నట్లు అనిపించింది. అయితే మూడో ఓవర్లోనే ఈ కథ ముగిసింది. భువనేశ్వర్ వేసిన ఓవర్‌లోని మొదటి బంతిని గిల్ కవర్స్ వైపు తరలించాడు. కానీ, అక్కడ నిలిచిన రాహుల్ త్రిపాఠి మెరుపు వేగంతో ఎడమవైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

విఫలమైన గుజరాత్ టాప్ ఆర్డర్..

కేవలం 7 పరుగులకే గిల్ ఔటయ్యాడు. విశేషమేమిటంటే, గత సీజన్ వరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి కేకేఆర్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లారు. గిల్ అవుట్ తర్వాత, యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ కూడా ఎక్కువసేపు నిలవలేక టి నటరాజన్‌కు బలి అయ్యాడు. అదే సమయంలో, వేగంగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్, మొదటి ఓవర్‌లోనే చాలా వేగంగా వేసిన బంతికి మాథ్యూ వేడ్‌ను ఎల్‌బిడబ్ల్యుగా పడగొట్టాడు. దీంతో గుజరాత్ 8 ఓవర్లలో 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 50(4 ఫోర్లు, ఒక సిక్స్) చేసి జట్టును ఆదుకున్నాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35(5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జాన్‌సెన్‌, ఇమ్రాన్‌ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.

163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నెమ్మదిగా ఇన్సింగ్స్ ప్రారంభించింది. అభిషేక్‌ శర్మ 32 బంతుల్లో 42(6 ఫోర్లు) పరుగులు చేసి రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి 17 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 57 పరుగులు చేసిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్(2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్34(2 ఫోర్లు, 2 సిక్స్‌ల్), మక్రమ్12 పరుగులు చేసి జట్టును గెలిపించారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, రషీద్‌ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read: IPL 2022 Orange Cap: టాప్-10లో చేరిన హార్దిక్.. అగ్రస్థానం నుంచి గిల్ డ్రాప్.. ఆరెంజ్‌ లిస్టులో ఎవరున్నారంటే?

IPL 2022 Purple Cap: వికెట్ల రేసులో దూసుకొస్తోన్న హైదరాబాద్ పేసర్.. అగ్రస్థానంలోనే చాహల్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu