సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్ నుంచి వచ్చిన ఏకైక సిక్స్ ఇది. అలాగే అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది 100వ సిక్స్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో 1046వ బంతిని ఆడుతూ ఈ ఫీట్ చేశాడు. దీంతో అతి తక్కువ బంతిల్లో 100 సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను ఈ రేసులో రిషబ్ పంత్ (1224 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (1313 బంతుల్లో), యువరాజ్ సింగ్ (1334 బంతుల్లో)ను వెనక్కు నెట్టాడు.