Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Gavaskar: కోహినూర్ డైమండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం.. మీకు వీలైతే భారత్‌కు తెప్పించండి: గవాస్కర్

సునీల్ గవాస్కర్ చమత్కారమైన మాటలతో క్రికెట్‌‌ వ్యాఖ్యతగా ఆకట్టుకుంటున్నాడని తెలిసిందే. అయితే, ఆదివరం మ్యాచ్ మధ్య విరామ సమయంలో 'కోహినూర్' వజ్రంపై సరదా వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు..

Sunil Gavaskar: కోహినూర్ డైమండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం.. మీకు వీలైతే భారత్‌కు తెప్పించండి: గవాస్కర్
Sunil Gavaskar
Follow us
Venkata Chari

|

Updated on: Apr 12, 2022 | 11:33 AM

మేం కోహినూర్‌ డైమండ్‌ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నామని భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్ సునీల్‌ గవాస్కర్‌(Sunil Gavaskar) అన్నారు. ఐపీఎల్ 2022లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గవాస్కర్.. ఆదివారం వాంఖడే వేదికగా రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(Rajasthan Royals and Lucknow Super Giants) టీంల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మాటలు అన్నారు. మ్యాచ్‌ బ్రేక్ టైంలో మెరైన్‌ డ్రైవ్‌ను ‘క్వీన్స్‌ నెక్లెస్‌’గా పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు గవాస్కర్, విల్కిన్స్ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. టీవీ స్క్రీన్‌లో ముంబైలోని అందమైన మెరైన్ డ్రైవ్‌ను చూపిస్తున్నారు. ఈమేరకు మెరైన్ డ్రైవ్‌ను వివరించమని విల్కిన్స్ భారత మాజీ ఆటగాడిని ఆడిగారు. మెరైన్ డ్రైవ్‌ను రాణి నెక్లెస్‌తో పోల్చుతూ, గవాస్కర్ విల్కిన్స్‌తో, “మేం ఇంకా కోహినూర్ వజ్రం కోసం ఎదురు చూస్తున్నాం.” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇద్దరు వ్యాఖ్యాతలు సరదాగా నవ్వుకున్నారు.

ఆ తర్వాత విల్కిన్స్‌ మాట్లాడుతూ.. ‘గవాస్కర్‌ ఇలా అంటాడని ముందే తెలుసు’ అంటూ బాంబ్ పేల్చాడు. ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ మాట్లాడుతూ, ‘మీకు స్పెషల్ రైట్స్ ఉంటే, బ్రిటిష్‌ ప్రభుత్వం దగ్గర ఉన్న కోహినూర్‌ డైమండ్‌ను భారత్‌కు అప్పగించాలని చెప్పండి’ అంటూ సరదాగా అన్నారు. గవాస్కర్‌, విల్కిన్స్ మధ్య కోహినూర్‌పై జరిగిన సంభాషణపై నెటిజన్లు కూడా స్పందించి, తెగ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Ravichandran Ashwin: అందుకే అలాంటి నిర్ణయం.. రిటైర్డ్‌ ఔట్‌పై క్లారిటీ ఇచ్చిన అశ్విన్‌.. ఏమన్నాడంటే?

IPL 2022: ఓడినా ఆ విషయంలో చెన్నైదే అగ్రస్థానం.. మరోసారి హిస్టరీ రిపీట్ కానుందా..