కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! ఇప్పటికే కసరత్తు ముమ్మరం..
మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నట్టుగా కవిత స్పష్టం చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తామని వివరించారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్తామని చెప్పారు. తనది ప్రజల ఎజెండా అని, సమస్యలపై పోరాటంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలోనూ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు.

2026 ఏప్రిల్ 6 శ్రీరామనవమి తర్వాత ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆమె కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని, దానికి సంబంధించిన అజెండా పై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారని సమాచారం. సామాజిక తెలంగాణ ధ్యేయంతో సర్వోదయ తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామని కవిత తెలిపారు. మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నట్టుగా కవిత స్పష్టం చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తామని వివరించారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్తామని చెప్పారు. తనది ప్రజల ఎజెండా అని, సమస్యలపై పోరాటంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలోనూ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు.
కవితకు గతంలో భారత్ జాగృతి ద్వారా మహిళల సమస్యలపై పోరాడిన అనుభవం ఉంది. కొత్త పార్టీ అజెండాలో మహిళా రిజర్వేషన్లు, మహిళా భద్రత, ఆర్థిక స్వాలంబనకు పెద్దపీట వేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సెంటిమెంట్‌ను కాపాడుతూనే, జాతీయ స్థాయిలో తెలంగాణ గళాన్ని వినిపించేలా పార్టీ విధివిధానాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. విద్యావంతులైన యువతను రాజకీయాల్లోకి ఆకర్షించేలా, ఆధునిక ఆలోచనలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం, సెంటిమెంట్ల ప్రకారం శ్రీరామనవమి తర్వాత కొత్త పనులు ప్రారంభించడం మంచిదని భావిస్తారు. ఈ ఒక కారణంగానే కవిత కొత్త పార్టీకి శ్రీ రామనవమి తర్వాత ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు లేదంటే పాదయాత్రల ద్వారా ప్రజల నాడిని పట్టుకుని, ఆ తర్వాతే పూర్తిస్థాయిలో పార్టీ అజెండాను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




