TSPSC Group I Recruitment 2022: త్వరలో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ! ఐతే అంతకంటేముందే..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తోంది..

TSPSC Group I Recruitment 2022: త్వరలో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ! ఐతే అంతకంటేముందే..
Tspsc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 12, 2022 | 3:00 PM

TSPSC Group 1 Recruitment 2022 Notification: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్‌ వాటిని క్రోడీకరిస్తోంది. మొత్తం 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా.. వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది. అవి రాగానే ప్రకటన జారీ చేయాలని కమిషన్‌ భావిస్తోంది. గ్రూప్‌-1లో 503 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతిచ్చిన మరుసటి రోజు నుంచి కమిషన్‌ ఆయా విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. పొరపాట్లకు తావులేకుండా ప్రతిపాదనలను సకాలంలో అందించేందుకు ప్రొఫార్మా సైతం అందించింది. అయినా నాలుగైదు విభాగాల ప్రతిపాదనల తయారీలో సాంకేతిక పొరపాట్లు తలెత్తాయి. వాటిని సవరించాలని కమిషన్‌ సూచించింది. ఆ సమాచారం అందితే త్వరలోనే గ్రూప్‌-1 ప్రకటన జారీ అయ్యే అవకాశాలున్నాయి.

ఓటీఆర్‌ నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు! రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (OTR)లో సవరణలకు 15 రోజుల క్రితం కమిషన్‌ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కమిషన్‌ వద్ద 25 లక్షల మంది ఓటీఆర్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 1.2 లక్షల మంది మాత్రమే సవరించుకున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌ సవరించుకున్న, నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే టీఎస్‌పీఎస్సీ జారీ చేసే ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ మేరకు ఓటీఆర్‌ సవరించాలని రోజుకు లక్ష మందికి కమిషన్‌ ఈ-మెయిళ్లు పంపిస్తోంది. చివరి నిమిషం వరకు వేచి ఉండటం కన్నా, ముందే సిద్ధం చేసుకోవాలని సూచిస్తోంది. వేసవి సెలవుల్లో పాఠశాలలు మూసివేస్తారని, ఉద్యోగార్థులు బోనఫైడ్‌ సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బందులు ఉంటాయని.. ఇప్పుడే అవసరమైన సర్టిఫికెట్లు సమకూర్చుకుని, ఓటీఆర్‌లో అప్‌లోడ్‌ చేసుకుంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయని అధికారులు సూచించారు.

Also Read:

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!