IRCTC: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త.. పర్యాటకానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే

వేసవి కాలం అంటేనే సెలవుల కాలం. ఆ సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు పలువురు పర్యాటకానికి పయనమవుతారు. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ(IRCTC) ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతోంది. ఉత్తర భారతదేశ యాత్రకు...

IRCTC: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త.. పర్యాటకానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే
Tourism Trains
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 14, 2022 | 8:13 AM

వేసవి కాలం అంటేనే సెలవుల కాలం. ఆ సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు పలువురు పర్యాటకానికి పయనమవుతారు. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ(IRCTC) ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతోంది. ఉత్తర భారతదేశ యాత్రకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జీపీ కిషోర్‌సత్య తెలిపారు. ‘మహాలయ పిండదాన్‌’ పేరుతో వారణాసి, ప్రయాగ్‌ సంగం, గయ ప్రాంతాలు చుట్టివచ్చేలా ఐదు రాత్రులు, ఆరు రోజుల ప్యాకేజీతో రైలును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 15 న ఈ రైలు.. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 20వ తేదీ గమ్యస్థానానికి చేరుకుంటుంది. స్వదేశీ దర్శన్‌(Swadeshi darshan) పేరుతో ఆగ్రా, మథుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌లో పర్యటించేలా ప్రత్యేక రైలు ప్యాకేజీలను(Train packages) రూపొందించారు. మే 27వ తేదీన తిరుపతి–రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. జూన్‌ 3వ తేదీ గమ్యస్థానానికి చేరుకుంటుంది. హైదరాబాద్‌ నుంచి కేరళ, తమిళనాడు, ఉత్తరాఖాండ్, నేపాల్, తిరుపతికి విమాన ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచారు. వివరాలకు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో చూడాలని, ప్రయాణికులు, పర్యటకులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అయోధ్యకు ప్రత్యేక రైలు..

రైలు నం. 05517/05518 బాపుధామ్ మోతిహరి – అయోధ్య కాంట్ – బాపుధామ్ మోతిహరి ఎక్స్‌ప్రెస్.. బీహార్‌లోని బాపుధామ్ మోతిహరి నుండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కాంట్ మధ్య నడిచే రైలు ఏప్రిల్ 23, 30, మే 7వ తేదీలలో బాపుధామ్ మోతిహారి నుంచి రాత్రి 9.12 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు అయోధ్య కాంట్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో అయోధ్య కాంట్ నుంచి బాపుధామ్ మోతిహరి మధ్య నడిచే 05518 రైలు.. అయోధ్య కాంట్ నుంచి ఏప్రిల్ 24, మే 1, మే 8వ తేదీల్లో రాత్రి 10.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు బాపుధామ్ మోతిహారి చేరుకుంటుంది.

Also read

James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..

RR vs GT IPL 2022 Match Prediction: రాజస్థాన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన గుజరాత్‌.. ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

APSRTC: డీజిల్ సెస్ పేరుతో ‘బాదుడే బాదుడు’.. ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలు..