Viral Video: ప్రమాదకర విన్యాసం.. కదులుతున్న కారుపై నుంచి గాల్లోకి జంప్..!

Viral Video: కొంతమంది చాలా ధైర్యవంతులు. ప్రమాదకర విన్యాసాలతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఇలా చేయడం వారికి చాలా సరదాగా ఉంటుంది. కానీ చూసేవారికి

Viral Video: ప్రమాదకర విన్యాసం.. కదులుతున్న కారుపై నుంచి గాల్లోకి జంప్..!
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Apr 14, 2022 | 11:20 AM

Viral Video: కొంతమంది చాలా ధైర్యవంతులు. ప్రమాదకర విన్యాసాలతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఇలా చేయడం వారికి చాలా సరదాగా ఉంటుంది. కానీ చూసేవారికి గుండెల్లో వణుకుపుడుతుంది. కొందరు వ్యక్తులు సింహాలు, పులుల వంటి ప్రమాదకరమైన జంతువులతో ఆడుకుంటారు. మరికొందరు ఎత్తైన పర్వతాల నుంచి కిందికి దూకి ప్రజలను ఆశ్చర్యపరుస్తారు. ఇంకొందరు బైక్‌ స్టంట్స్‌, కారు రేసింగ్‌ చేస్తారు. ఇటువంటి విన్యాసాలలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు పట్టించుకోరు. కిక్‌ కోసం ఏది కావాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు భయం లేకుండా చేస్తారు. తాజాగా ఒక డేంజర్ స్టంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆ వ్యక్తి అలా ఎలా చేశాడంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి.. అందులో చేసిన విన్యాసం ఏంటో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కదులుతున్న కారు పై కప్పుపై ఒక వ్యక్తి కూర్చోవడం మనం గమనించవచ్చు. కారు వంతెనపై ప్రయాణిస్తుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా కారుపై నుంచి దూకడం చూడవచ్చు. ఆ వ్యక్తి గాలిలోనే రెండు, మూడుసార్లు పల్టీలు కొట్టి కిందపడిపోతున్న సమయంలో తన దగ్గర ఉన్న పారాచూట్‌ను ఓపెన్ చేస్తాడు. ఈ వీడియోని చూస్తున్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విన్యాసం చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఒకవేళ సమయానికి పారాచూట్‌ ఓపెన్ కాకపోతే అతడి పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి విన్యాసాలు స్టంట్‌ మెన్ల అధ్వర్యంలో జరగాలి. వారు స్టంట్‌ చేసేటప్పుడు పారాచూట్‌లో ఏదైనా లోపం ఉందా అని అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి ప్రమాదాలు సంభవిస్తాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ వీడియోలోని వ్యక్తి స్టంట్ విజయవంతమైంది.

ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి ఇప్పటివరకు 2 లక్షల 20 వేల వ్యూస్‌ వచ్చాయి. అయితే 5 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో నెటిజన్లు వీడియోను చూసిన తర్వాత వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తిని ధైర్యవంతుడని, మరికొందరు అతన్ని పిచ్చివాడిగా అభివర్ణిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!

Heat Rashes: ఎండాకాలం హీట్‌ ర్యాషెస్‌ సమస్య వేధిస్తుందా.. ఇంట్లోనే వీటిని ట్రై చేయండి..!

IPL 2022లో అత్యంత పొడవైన సిక్స్.. ఈ18 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పేరిట నమోదైంది..