- Telugu News Photo Gallery Check here to know the side Effects of Green Tea if You Have crossed the limit
Health Tips: గ్రీన్ టీ మన ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.. ఆ వివరాలు మీ కోసం..
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి అంటే గుండెకు, ముఖ్యంగా గుండె, కాలేయం, జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. అయితే రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు, అలాగే ఖాళీ కడుపుతో దీనిని అసలు తీసుకోవడదు. అలా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు మనల్ని వెంటాడే అవకాశం ఉంది. అవేమిటో తెలుసుకుందాం...
Updated on: Dec 21, 2022 | 1:19 PM


కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం, గుండె జబ్బులును నివారించడంలో గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ టీలో క్యాన్సర్‌ను నయం చేసే శక్తి ఉంది. అయితే దీనిని చక్కెర లేకుండా తీసుకోవాలి. అవసరమైతే తేనె ఉపయోగించుకోవచ్చు.

గ్రీన్ టీ శరీరానికి ఎంతో మేలు చేసినప్పటికీ, పరిమితికి మించి తీసుకోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పి, తక్కువ నిద్ర, తలతిరగడం వంటి సమస్యలు కలగవచ్చు.

అలాగే గ్రీన్ టీ గుండెకు కూడా చాలా మంచిది. కానీ అవసరానికి మించి తాగితే గుండె సక్రమంగా కొట్టుకోకపోవడమే కాక తర్వాత దడ కూడా పెరగవచ్చు.

గ్రీన్ టీ కాలేయానికి మంచిదైనప్పటికీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఖాళీ కడుపుతోదీనిని అసలు తీసుకోకూడదు. బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటారు. నిజానికి ఇది ప్రతికూలమైనది.





























