Winter Health Tips: చలికాలంలో జలుబు వేధిస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
సాధారణంగా చలికాలంలో వచ్చే జలుబు సమస్యతో ముక్కు గొంతు ఇన్ ఫెక్షన్ కు గురై తగ్గడానికి కొన్ని రోజుల నుంచి వారం వరకూ పడుతుంది. అలాగే అది శ్వాసకోశ ఇబ్బంది అయితే గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి.

శీతాకాలంలో అందరూ సాధారణంగా జలుబుతో ఇబ్బంది పడతారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఒకటే సమస్య. ఈ కాలంలో ఎక్కువగా ఇంట్లోనే ఉండడంతో శ్వాసకోశ వైరస్ లు వ్యాప్తి చెందుతాయి. దీంతో రోగ నిరోధక శక్తిని కోల్పోయి అనారోగ్యానికి గురవుతాం. అలాగే చర్మ, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు అధికమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చలికాలంలో వచ్చే జలుబు సమస్యతో ముక్కు గొంతు ఇన్ ఫెక్షన్ కు గురై తగ్గడానికి కొన్ని రోజుల నుంచి వారం వరకూ పడుతుంది. అలాగే అది శ్వాసకోశ ఇబ్బంది అయితే గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో జ్వరం వచ్చే అవకాశం ఉంది. జ్వరానికి ఐదు రోజులు చికిత్స తీసుకున్నా జలుబు తగ్గడానికి రెండు వారాల దాకా సమయం పడుతుంది. అలాగే చర్మం పొడిబారడంతో దురదలు, తామర, సోరియాసిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు బ్రోన్కైటిస్ వంటి రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్లు వచ్చే సూచనలున్నాయని పేర్కొంటున్నారు. అయితే శీతాకాలంలో వచ్చే జీవితాంతం నిరోధించలేమని కానీ, వాటి నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- క్రిములు, బ్యాక్టిరియాను నివారించడానికి తరచూ చేతులు కడుగుకోవాలి.
- విశ్రాంతి తీసుకోవడంతో పాటు నీటిని అధికంగా తాగాలి.
- ఒకవేళ ఎవరైనా జలుబు బారిన పడితే వారు వాడిన వస్తువులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బట్టలు, టవల్, దుప్పట్లు వంటివి ఒకేచోట పెట్టకూడదు.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- కుటుంబంలోని వారంతా ఫ్లూ నుంచి రక్షణ కోసం వార్షిక ఫ్లూ టీకాలను కచ్చితంగా తీసుకోవాలి.
- గోరు వెచ్చని నీరు తాగడం శ్రేయస్కరం.
- రెస్ట్ రూమ్ వాడిన తర్వాత కచ్చితంగా సబ్బుతో చేతులు కడుగుకోవాలి.
- వీలైనంతగా తాజా పండ్లు, కూరగాయలు వాడాలి.
- ఉన్ని దుస్తులు లేదా మందపాటి దుస్తులు ధరించడం ద్వారా చలికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి.
- ఒకవేళ అనారోగ్యానికి గురైనట్టు అనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..