Christmas Party Foods: ఈ ఫుడ్స్ మీ ఆకలిని మరింత పెంచేస్తాయి. క్రిస్మస్ పార్టీకి ఇవే బెస్ట్. మీ మెనూలో తప్పక ఉండాల్సిందే!

ఈ సారి క్రిస్మస్ కి కూడా మీరు ఇలానే ఏదైనా పార్టీ ప్లాన్ చేస్తున్నారా? బంధువులు, స్నేహితులకు మంచి ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే మీ మెనూ కు మేము చెప్పబోయే పదార్థాలను స్టార్టర్స్ గా ఉండేటట్లు చూసుకోండి.

Christmas Party Foods: ఈ ఫుడ్స్ మీ ఆకలిని మరింత పెంచేస్తాయి. క్రిస్మస్ పార్టీకి ఇవే బెస్ట్. మీ మెనూలో తప్పక ఉండాల్సిందే!
Potato Shots
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 21, 2022 | 3:14 PM

క్రిస్మస్ పండుగ వచ్చేసింది. ఇంటిపైన స్టార్లు, ఇంట్లో క్రిస్మస్ ట్రీలు, ఇంటి నిండా బంధువులతో ఊర్లు కళకళలాడుతుంటాయి. క్రిస్మస్ అంటేనే స్నేహితులకు మంచి గిఫ్ట్స్ ఇవ్వడం.. బంధువులతో పాటు వారిని ఇంటికి పిలిచి చక్కని ఆతిథ్యాన్ని అందివ్వడం వంటివి చేస్తూ వారిపై మీకున్న ప్రేమను చూపించడమే పండుగ పరమార్థం. ఆ విధంగానే చాలా మంది ఏటా చేస్తుంటారు. ఈ సారి క్రిస్మస్ కి కూడా మీరు ఇలానే ఏదైనా పార్టీ ప్లాన్ చేస్తున్నారా? బంధువులు, స్నేహితులకు మంచి ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే మీ మెనూ కు మేము చెప్పబోయే పదార్థాలను స్టార్టర్స్ గా ఉండేటట్లు చూసుకోండి. ఇవి మీ పార్టీని మరింత ఆకర్షణీయంగా, రుచికరంగా మార్చేస్తాయనడంలో సందేహం లేదు. అలాగే వచ్చిన అతిథులు మీ రుచికి దాసోహం అనకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం ఆ డెలీషియస్ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం పదండి..

చీజ్ పొటాటో షాట్స్..

సాధారణంగా బంగాళదుంపతో చీజ్ మిక్స్ అయితే ఆ రుచి జిహ్వకు మధురానుభూతిని మిగుల్చుతుంది. మీరు గనుక ఈ క్రిస్మస్ కి ఆతిథ్యం ఇవ్వదలుచుకుంటే ఈ చీజ్ పొటాటో షాప్స్ తప్పనిసరిగా మీ మెనూలో ఉండేటట్లు చూసుకోండి. దీని తయారీ కోసం బంగాళదుంపలను ఉడికించి, పై పొట్టు తీసేయాలి. వాటిని చితిపి, కొత్తిమీర, బ్రెడ్ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు వంటివి కలిపి ముద్దలుగా చేయాలి. దానికి కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఇచ్చి ఆయిల్లో వేయించి, సర్వ్ చేయడమే.

పన్నీర్ పాప్ కార్న్..

మీ మెనూలో శాఖాహార సంబంధిత పదార్థాలు ఏమైనా ఉంచాలి అనుకుంటే తప్పనిసరిగా పన్నీర్ పాప్ కార్న్ తీసుకోండి. ఇది చికెన్ పాప్ కార్న్ కు తరహాలో ఉండే పూర్తి వెజిటేరియన్ ఫుడ్. దీనిని ఇష్టపడని వారు ఉండరు. దీని తయారీ కోసం ఓ వంట పాత్ర తీసుకొని దానిలో పన్నీర్, కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నెమ్మదిగా పన్నీర్ క్యూబ్ లు విడిపోకుండా కలపాలి. ఇంకో పాత్రలో కొంచె బేసన్ ఫ్లోర్ తీసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, వంట సోడాతో సరిపడా నీరు పోసుకుని కలుపుకోవాలి. మరీ నీరులా అయిపోకుండా చూసుకోవాలి. దీనిలో అప్పటికే చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్లను వేసి , బ్రెడ్ ముక్కలను యాడ్ చేయాలి. అనంతరం ఆయిల్ లో ఫ్రై చేస్తే పన్నీర్ పాప్ కార్న్ రెడీ!

ఇవి కూడా చదవండి

చికెన్ నాచోస్..

నాచోస్ అంటేనే పార్టీ ఫేవరెట్. వీటిని చికెన్ తో కలిపి అతిథులకు వడ్డిస్తే ఆ రుచికి వారు ఫిదా అవ్వాల్సిందే. దీనిని ఎలా తయారు చేస్తారంటే.. కొన్ని రోటీలను తీసుకుని వాటిని చక్కగా కాల్చండి. మరో ప్యాన్ ను తీసుకుని ఆయిలో వేసి, కట్ చేసిన చికెన్ వేగనివ్వండి. అనంతరం కారం, ఉప్పు, మిరియాలు వేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు, టమోటాలు, కాప్సికమ్, మొక్కజొన్న మరో పాత్రలో తీసుకొని వేయించండి. తర్వాత అంతకుముందు వేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని దీనిలో వేయండి. అంతే దీనికి కొంచెం వేడి సాస్, చీజ్ సాస్ కలిపి వడ్డిస్తే తిన్నవారు వహ్వా అనకుండా ఉండలేరు.

రొయ్యలతో వేడి వేడిగా..

క్రిస్మస్ మెనూలో సులువగా వండుకోదగిన సీ ఫుడ్ ఏదైనా ఉండాలనుకుంటే ఈ వెల్లుల్లి రొయ్యల వంటకం ఉత్తమం. దీని తయారీకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం వైట్ వైన్, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్ తో ఇటాలియన్ స్టైల్ లో వండుకోవచ్చు. వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ నాన్ స్టిక్ ప్యాన్ ను తీసుకొని బట్టర్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేగ నివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన రొయ్యలను తీసుకొని దానిలో వేసి, రుచి సరిపడా ఉప్పు, మిరియాలను వేసి ఉడికించండి. తర్వాత కొంచెం వైట్ వైన్ కలిపి మరో సారి ఉడికించండి. చివరిలో కాస్త కొత్తిమీర, నిమ్మరసం వేసి దించేయడమే.

పొటాటో రింగ్స్..

బంగాళ దుంపలను మరో విధంగా మెనూలో యాడ్ చేయవచ్చు. దీనిని తయారు చేయడానికి ప్యాన్ ను తీసుకొని దానిలో బట్టర్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి కాస్త నీరు కలిపి ఉడికించాలి. అనంతరం రవ్వ కలపాలి. ఆ రవ్వను ఆరనివ్వాలి. అనంతరం రెండు ఉడికించిన బంగాళదుంపలను దానిలో వేసి బాగా కలిపి, ముద్దలుగా చేయాలి. ఈ ముద్దలను కార్న్ ఫ్లోర్ తో కోట్ చేసి.. ఫ్రై చేసుకోవడమే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో