AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silent Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటో తెలుసా.. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..

నిశ్శబ్ద గుండెపోటు సూక్ష్మంగా ఉండటం వల్ల ప్రజలు దానిని గమనించలేరు. కానీ తరువాత అది జీవితానికి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. ఈ పరిస్థితిలో నిశ్శబ్ద గుండెపోటు..

Silent Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటో తెలుసా.. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..
Heart Disease
Amarnadh Daneti
|

Updated on: Dec 21, 2022 | 7:42 PM

Share

ఎవరైనా వ్యక్తికి గుండెపోటు వస్తే వెంటనే ఉన్నచోట కుప్పకూలిపోతారు. కొంతమందికి అయితే గుండె పోటకుకు ముందు శరీరం అంతా చెమటలు పడుతుంది. గుండె పోటుకు ముందు ఛాతి పట్టుకోవడం, కళ్ళు వెనక్కి తిప్పడం, తీవ్రమైన నొప్పితో మూలగడం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. ఉంటాం కానీ ఇది నిజానికి చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా గుండెపోటు వేగంగా అనుకోకుండా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఇది నెమ్మదిగా కూడా వస్తుంది. దీనిని గుర్తించడం చాలా ముఖ్యం. నిశ్శబ్ద గుండెపోటు సూక్ష్మంగా ఉండటం వల్ల ప్రజలు దానిని గమనించలేరు. కానీ తరువాత అది జీవితానికి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. గుండెపోటులో కూడా అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా వ్యక్తి గుండెపోటుకు గురైతే.. అతడి శరీరం వైద్యానికి సహకరిస్తే.. తప్పకుండా ఆ వ్యక్తి ప్రాణపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. అదే కార్డియాక్ అరెస్ట్ అయితే  మాత్రం వైద్యానికి శరీరం సహకరించే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఈ పరిస్థితిలో నిశ్శబ్ద గుండెపోటు లక్షణాల గురించి తెలుసుకుందాం.

నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. గుండె పనిచేయడానికి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం అవసరం కాబట్టి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో అడ్డుగా ఏదైనా ఏర్పడితే రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండెకు రక్తప్రసరణ లేనప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. దీని కారణంగా నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని లక్షణాలు తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం, ఇవన్నీ కొన్నిసార్లు గుండెపోటు ముందు కనిపిస్తాయి. ఈ లక్షణాలుంటే ఇది నిశ్శబ్ద గుండెపోటు అని అర్థం చేసుకోవచ్చు. లేదంటే మీ ఛాతీ మధ్యలో కొంచెం నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది. దీని కారణంగా మీరు కొద్దిగా ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు సాధారణంగా ఎవ్వరైనా నిర్లక్ష్యం చేస్తారు. ఇది తరువాత ప్రమాదకరంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే లేదా అకస్మాత్తుగా మైకం వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఛాతీ నొప్పితో శ్వాస ఆడకపోవడాన్ని కలిగి ఉండవచ్చు. ఇది నిశ్శబ్ద గుండెపోటుకు సాధారణ సంకేతం. ఒక్కోసారి మీరు మైకంతో మూర్ఛపోవచ్చు.

ఇవి కూడా చదవండి

జలుబు, చెమటలు, వికారం సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు కావచ్చు.సాధారణంగా ఈ లక్షణాలు ఫ్లూలో కనిపిస్తాయి కానీ ఫ్లూ చికిత్స తర్వాత కూడా ఉంటే తీవ్రంగా పరిగణించి వైద్యుడిని సంప్రదించాలి.  ఎప్పుడైనా ఏ విధంగానైనా అసౌకర్యంగా భావిస్తే ముందుగా గుండెపోటును నివారించడానికి గుండె పరీక్ష చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..