Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? ఊహకు అందని సంఘటన!!

మనిషి చనిపోయిన తర్వాత ఆ మృతదేహం దగ్గరకు చీడపీడలు వస్తాయని, తద్వారా మృతదేహం త్వరగా పాడైపోతుందనే భయం కూడా ఉంటుంది.

Garuda Puranam: మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? ఊహకు అందని సంఘటన!!
Garuda Puran
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 21, 2022 | 9:53 PM

ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అనేక రకాల నియమాలు పాటిస్తారు. ఆ నిబంధనలను మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు పాటిస్తారు. అనుసరించాల్సిన అన్ని ఇతర నియమాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి. మరణానంతరం చేసే కర్మలను అంతిమ సంస్కారాలు అంటారు. కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎప్పుడూ నిర్వహించబడవు. కుటుంబంలోని పెద్ద కొడుకు మాత్రమే దహన సంస్కారాలు చేయాలి. అలాగే మృతదేహాన్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు.

Garuda Puran 1

గరుడ పురాణం ప్రకారం.. చాలా తాంత్రిక కార్యక్రమాలు రాత్రిపూట జరుగుతాయి. రాత్రిపూట మృత దేహాన్ని ఒంటరిగా వదిలేస్తే, చనిపోయిన ఆత్మ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మృత దేహాన్ని ఊరికే వదిలేయకూడదని అంటున్నారు.

గరుడ పురాణం ప్రకారం,.. మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే, దుష్టశక్తులు శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. అటువంటి పరిస్థితిలో మృతదేహాన్ని ప్రత్యేకంగా రాత్రిపూట ఒంటరిగా ఉంచరు. ఈ సమయంలో దుష్టశక్తులు ఎక్కువ చురుకుగ్గా ఉంటాయి.

చనిపోయిన తర్వాత మృతదేహంలో అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా మృతదేహం చుట్టూ కూర్చుని అగరబత్తని వెలిగిస్తారు. ఒక వ్యక్తి మరణం తరువాత అతని ఆత్మ మృతదేహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో వారు తిరిగి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ప్రజలు మృతదేహాలను ఒంటరిగా వదలరు.

ఇవి కూడా చదవండి

మనిషి చనిపోయిన తర్వాత ఆ మృతదేహం దగ్గరకు చీడపీడలు వస్తాయని, తద్వారా మృతదేహం త్వరగా పాడైపోతుందనే భయం కూడా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి