Chanakya Niti: ఆ విషయాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు.. చాణక్య చెప్పిన విశేషాలు..
గొప్ప పండితుడు, నీతిశాస్త్ర రచయిత, దౌత్యవేత్త, ఉపాధ్యాయుడు, వ్యూహకర్త, ఆర్థిక వేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఆచార్య చాణక్యుడు. భవిష్యత్‌ను అంచనా వేసి, వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశనం చేసే అద్భుత..
గొప్ప పండితుడు, నీతిశాస్త్ర రచయిత, దౌత్యవేత్త, ఉపాధ్యాయుడు, వ్యూహకర్త, ఆర్థిక వేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఆచార్య చాణక్యుడు. భవిష్యత్‌ను అంచనా వేసి, వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశనం చేసే అద్భుత విజన్ ఉన్న వ్యక్తి. క్రీస్తు పూర్వానికి చెందిన చాణక్యుడి సిద్ధాంతాలు, సూచనలు ఇప్పటికీ ఆచరణీయమే. ఆయన చెప్పిన విధానాలు పాటించడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించవచ్చు. విజయాన్ని సునాయాసంగా పొందవచ్చు. అయితే, ఆచార్య చాణక్య జీవితానికి సంబంధించి ఎన్నో కీలక వివరాలు వెల్లడించారు. పురుషుల గురించి చెప్పినట్లే స్త్రీల గురించి కూడా చెప్పారు. పురుషులు, స్త్రీలలో సారూప్యతలేంటి, భిన్నాలేంటి వంటి వివరాలు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో పురుషులకంటే స్త్రీలే గొప్పవారని పేర్కొన్నారు. స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన కీలక అంశాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
ఈ కారణంగా స్త్రీలను శక్తి స్వరూపిణిగా కొలుస్తారు..
పురుషుల కంటే స్త్రీలకు ఆరు రెట్లు ఎక్కువ ధైర్యం ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఈ కారణంగా స్త్రీలను శక్తి స్వరూపంగా పరిగణించడం జరిగింది. అయితే, ఇదే సమయంలో స్త్రీలలోని సిగ్గు, వారి ధైర్యాన్ని కప్పేస్తుంది. స్త్రీలలో సిగ్గు పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్య.
శృంగార కోరికలు..
ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం.. స్త్రీలకు పురుషుల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ శృంగారభరిత ఆలోచనలు ఉంటాయట. కానీ, సిగ్గు, బిడియం, సమాజం పట్ల వారికున్న గౌరవం, పరువు, స్వాభిమానం వంటి కారణాలతో వారు తమలోని భావాలను నియంత్రించుకుంటారు. బయటకు వ్యక్తీకరించలేరు. అంతేకాదు.. కుటుంబ పరంగా స్త్రీలు చాలా శక్తివంతులు. ఎలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడే సామర్థ్యం స్త్రీలకు ఉంది. అందుకే వారు కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తారని చెబుతారు చాణక్యుడు.
స్త్రీలకు ఆకలి కూడా ఎక్కువే..
స్త్రీలు ఎక్కువగా ఆహార ప్రియులు. పురుషుల కంటే రెట్టింపు ఆకలితో ఉంటారు. నచ్చినది తినాలని భావిస్తారు. అయితే, ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణంగా మహిళలో ఆహారం తీసుకోవాలనే ఆలోచనలు తగ్గిపోయాయి. ఆహారం తీసుకోవడం అటుంచితే.. తినకండా పస్తులు ఉంటూ అనారోగ్యం బారిన పడుతున్నారు.
గమనిక: ఇందులో సమాచారం చాణక్యనీతి ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.