Hair Care: అందుకే రాత్రిళ్లు తల స్నానం చేయకూడదు..

కొంతమందికి రాత్రిళ్లు తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. పగలంతా ఉద్యోగ విధుల్లో బిజీగా ఉన్నళ్లు సాయంత్రం ఇంటికి చేరగానే పనులన్నీ పూర్తి చేసుకుని తలస్నానం..

Hair Care: అందుకే రాత్రిళ్లు తల స్నానం చేయకూడదు..
Head Bath
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 23, 2022 | 8:03 AM

కొంతమందికి రాత్రిళ్లు తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. పగలంతా ఉద్యోగ విధుల్లో బిజీగా ఉన్నళ్లు సాయంత్రం ఇంటికి చేరగానే పనులన్నీ పూర్తి చేసుకుని తలస్నానం చేస్తుంటారు. ఉదయం నిద్రలేచి త్వరగా ఆఫీసుకు వెళ్లిపోవచ్చని ఈ విధంగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో తలస్నానం చేసి నప్పుడు తడి వెంట్రుకలను దువ్వడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. అలా అని తల పూర్తిగా ఆరిపోయే వరకు దువ్వుకోకుండా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మెరుపును కోల్పోతాయి. తలస్నానం తర్వాత టవల్‌తో చుట్టుకోకూడదు. ఇలా చేస్తే చుండ్రు చేరే ప్రమాదం ఉంది. టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల కుదుళ్లు బలహీనంగా మారతాయి. అలాగని సున్నితంగా రుద్దినా జుట్టు ఊడిపోయే ఆస్కారం ఉంది. బదులుగా టవల్‌తో మాడును నెమ్మదిగా నీళ్లు ఇంకిపోయేలా ఒత్తుకుంటే సరిపోతుంది.

జుట్టు సరిగా ఆరబెట్టుకోకుండా పడుకోవడం వల్ల దిండు, బెడ్‌కు వెంట్రుకలు అంటుకుంటాయి. ఇలా చేయడం వల్ల జుట్టు మరింత చిక్కుబడుతుంది. దువ్వినప్పుడు జుట్టు రాలిపోతుంది. క్రమంగా హెయిర్ ఫాల్ మొదలవుతుంది. అంగేకాకుండా తడిజుట్టుతో పడుకోవడం వల్ల చుండ్రు, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తల స్నానం తర్వాత జుట్టు పూర్తిగా ఆరబెట్టుకుని నిద్రపోవడం బెటర్‌ అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

తాజా ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.