Kitchen Hacks: మనమంతా అదే తప్పు చేస్తుంటాం.. చలికాలంలో కూడా వాటిని ఫ్రిజ్‌లో పెడుతాం..
మనలో చాలా మంది ఒకేలా తప్పు చేస్తుంటాం. వంటింట్లోని అన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. పప్పులు, ఉప్పులు, పిండి, పండ్లు, కాయలు ఇలా అన్నింటిని అందులో పెట్టేస్తారు. ఏది ఫ్రిజ్‌లో పెట్టాలి..? ఏది ఫ్రిజ్‌లో పెట్టకూడదో కూడా తెలుసుకోకుండా అదే పని చేస్తుంటారు. అయితే వేటిని పెట్టకూడదో తెలుసుకుందాం..
రిఫ్రిజిరేటర్‌ని మనం ఎక్కువ కాలం ఆహారం, పానీయాలను తాజాగా ఉంచే సాంకేతిక పురోగతిలో ఒకటిగా పరిగణించవచ్చు. ఆహారం, పానీయాలను కొంతకాలం ఫ్రిజ్‌లో ఉంచడం ఈ కాలపు అవసరం. మన బిజీ లైఫ్‌లో మనం ఉదయం తీసుకునే ఆహారాన్ని రాత్రి వరకు ఫ్రిజ్‌లో భద్రంగా ఉంచుతాం. తరచుగా మనం వారాంతంలో కూరగాయలు, పండ్లను కొనుగోలు చేస్తాం, వారమంతా వాటిని ఉపయోగిస్తాం. అయితే, పండ్లు, కూరగాయలను నిల్వ చేయడం పనిని సులభతరం చేస్తుంది. అయితే శీతాకాలంలో కొన్ని ఆహారపదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం వల్ల వాటి ప్రభావం మారుతుందని.. అవి ఆహార శరీరంలో విషంలా పనిచేస్తాయని మీకు తెలుసా..? కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ కూరగాయలు తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతాం. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి ప్రభావం మారి మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలిస్తే షాక్ అవుతారు. ఇందులో కొన్ని అలాంటి కూరగాయలు, పండ్లు ఉన్నాయి. వీటిని తెలిసిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు:
డైటీషియన్ అందించిన సమాచారం ప్రకారం, టమోటాలు ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. మీరు టమోటాలు ఉంచాలనుకుంటే.. వాటిని గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, ఆకృతి, వాసన మారుతుంది. టొమాటో పండిన తర్వాత ఇథిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది దాని పక్కనే ఉండే ఇతర కూరగాయలను వేగంగా పాడు చేస్తుంది. మీరు టమోటాలు ఉంచాలనుకుంటే, వాటిని గదిలో ఇతర కూరగాయలతో కలిపి అస్సలు ఉంచకండి.
దోసకాయను ఫ్రిజ్‌లో ఉంచవద్దు:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ ప్రకారం, దోసకాయలను కొన్ని రోజులు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంచినట్లయితే.. అవి వేగంగా కుళ్ళిపోతాయి. అందుకే ఫ్రిజ్‌లో దోసకాయలను అస్సలు ఉంచవద్దు. కానీ సాధారణ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచండి. ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచిన దోసకాయ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
అవోకాడో:
అవోకాడోను ఫ్రిజ్‌లో ఉంచవద్దు. అవకాడోలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయి. ఈ ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు.. దాని బయటి పొర గట్టిగా మారుతుంది. లోపలి భాగం చెడిపోవడం మొదలుతుంది. పచ్చి అవకాడోలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి పచ్చిగా కనిపించినప్పటికీ పాడైపోవడమే కాదు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు:
కొంతమంది ఇతర కూరగాయలతో పాటు బంగాళదుంపలను కూడా ఫ్రిజ్‌లో ఉంచుతారు. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది, ఇది షుగర్ రోగుల రక్తంలో చక్కెరను పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచకుండా, సాధారణ ఉష్ణోగ్రతలో బహిరంగ ప్రదేశంలో ఉంచండి.
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచవద్దు:
వెల్లుల్లిని గది ఉష్ణోగ్రత వద్ద లేదా రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్‌లో అనేక మార్గాల్లో నిల్వ చేయవచ్చు, హెల్త్‌లైన్ నివేదించింది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తాజా వెల్లుల్లిని నిల్వ చేయడానికి సులభమైన. ఉత్తమ మార్గం మీ వంటగదిలోనే ఉంది. వంటగదిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద వెల్లుల్లిని నిల్వ చేయడం వల్ల దాని ప్రభావం మారదు. ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం